Relationship మీతో తాత్కాలిక బంధం మాత్రమే ఉన్నారని చెప్పే 7 సంకేతాలివే..!
Relationship రిలేషన్ షిప్ లో అవతల వ్యక్తి తమతో చేస్తున్న పనుల పట్ల వ్యవహరిస్తున్న తీరు పట్ల వారు మనతో చేస్తున్న రిలేషన్ ఎంత సీరియస్
- Author : Ramesh
Date : 03-11-2023 - 5:10 IST
Published By : Hashtagu Telugu Desk
Relationship రిలేషన్ షిప్ లో అవతల వ్యక్తి తమతో చేస్తున్న పనుల పట్ల వ్యవహరిస్తున్న తీరు పట్ల వారు మనతో చేస్తున్న రిలేషన్ ఎంత సీరియస్ అన్నది తెలుస్తుంది. ముఖ్యంగా మీతో తాత్కాలిక బంధంతో వారు రిలేషన్ షిప్ లో ఉన్నారని చెప్పే 7 సంకేతాలు ఇవే.
మొదటిది ఫ్యూచర్ గురించి సంభాషణ చేయరు. ఆరోగ్యకరమైన వాతావరణం ఉండదు. భాగస్వామితో పంచుకునే ఫ్యూచర్ గురించి సంభాషించడం అనేది ప్రాధాన్యత కలిగి ఉంటుంది. కానీ అలాంటి సంభాషణలు లేకపోతే ఆ బంధం ఎప్పటికీ నిలబడదు.
ఇంకా కమిట్మెంట్ లో లోపం స్పష్టంగా కనిపిస్తుంది. వారు మీకు చెప్పిన మాటలు. చేస్తున్న పనులు ఇవన్నీ కూడా అంత కమిటెడ్ గా అనిపించవు.
మిమ్మల్ని నెమ్మదిగా వారి జీవితంలోకి చేర్చుకునే ప్రయత్నం చేయకపోతే. వారు మిమ్మల్ని వారి కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు పరిచయం చేయడానికి సమయాన్ని వెచ్చించకపోతే ఏదో జరుగుతుందని గుర్తించాలి. ఆ ప్రయత్నం చేయకపోతే మాత్రం మీతో అతను సీరియస్ రిలేషన్ షిప్ లో లేరని అర్ధం చేసుకోవాలి.
Also Read : Relationship : ఒక వ్యక్తి మిమ్మల్ని పిచ్చిగా ప్రేమిస్తున్నాడని తెలిపే 9 సంకేతాలు..!
మీతో జీవితం పంచుకునే భాగస్వామి తమకు ఇష్టమైన సినిమాలు మిగతా విషయాల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. కానీ వారు మీ ఫోటోలను మీ విషయాలను పోస్ట్ చేయడానికి సాహసించరు.
మీతో వారు ప్రవర్తిస్తున్న తీరు మీతో వారు అంత సీరియస్ రిలేషన్ షిప్ ఉండట్లేదని అర్ధమవుతుంది. అంతేకాదు వారు ఏం చేసినా సరే మీరు అంత సౌకర్యవంతంగా ఉండలేరు. ఏదో విషయంలో మిమ్మల్ని వారు ఇబ్బంది పెడుతుంటారు.
మీ మధ్య సరైన సంభాషణలు ఉండవు. ఏదైన బంధం బలపడటానికి రిలేషన్ షిప్ స్ట్రాంగ్ అవడానికి సంభాషణలు చాలా అవసరం. అలాంటిది సభాషణలు లేకపోవడం అనేది దూరం అయ్యేందుకు మొదటి స్టెప్ అని చెప్పొచ్చు.
కేవలం వాళ్లకు కన్వినెంట్ గా ఉండే పనులు ఆ టైం లోనే మీతో వారు క్లోజ్ గా ఉంటారు.
We’re now on WhatsApp : Click to Join