Pre-Wedding Shoot : ఇది ప్రీ-వెడ్డింగ్ షూట్ లా లేదు..ఫస్ట్ నైట్ మాదిరి ఉంది..మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు..!
Pre-Wedding Shoot : ఈ వీడియోలో జంట స్విమ్ సూట్‌లో ఉండి, కెమిస్ట్రీని చూపించాలనే ఉద్దేశంతో ముద్దులాడుతూ నటించారు. కెమెరామెన్ నీటిలోనూ, బయట నుంచీ వీడియోను అత్యంత క్రియేటివ్‌గా చిత్రీకరించినప్పటికీ
- By Sudheer Published Date - 08:35 PM, Sun - 29 June 25

ఇటీవలి కాలంలో పెళ్లి అనగానే సంగీత్, హల్దీ, రిసెప్షన్‌లతో పాటు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నది ప్రీ-వెడ్డింగ్ ఫోటో షూట్. కొన్ని జంటలు తమ ప్రేమను, అనుబంధాన్ని ప్రత్యేకంగా చూపించాలనే ఉద్దేశంతో భిన్నంగా ఆలోచిస్తున్నాయి. అయితే, ఈ ప్రయత్నాలు కొన్నిసార్లు సామాజిక మర్యాదలు, సాంప్రదాయాలకు విరుద్ధంగా మారుతున్నాయి. ఇటీవల ఓ జంట చేసిన ప్రీ-వెడ్డింగ్ వీడియోలో వారు స్విమ్మింగ్ పూల్‌లో అత్యంత రొమాంటిక్ హద్దులు దాటి కనిపించడంపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.
Good News: మెడికోలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఒకేసారి 15 శాతం పెంచుతూ జీవో జారీ
ఈ వీడియోలో జంట స్విమ్ సూట్‌లో ఉండి, కెమిస్ట్రీని చూపించాలనే ఉద్దేశంతో ముద్దులాడుతూ నటించారు. కెమెరామెన్ నీటిలోనూ, బయట నుంచీ వీడియోను అత్యంత క్రియేటివ్‌గా చిత్రీకరించినప్పటికీ, వీడియో విడుదలైన వెంటనే నెటిజన్ల నుంచి నెగెటివ్ స్పందన వచ్చింది. “ఇది ప్రీ-వెడ్డింగ్ షూట్ కాదుగా.. ఫస్ట్ నైట్ వీడియోలా ఉంది!” అంటూ పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి షూట్ లు శుభప్రదంగా చూసే సమాజంలో తగిన విమర్శలకు దారి తీస్తోంది.
ప్రీ-వెడ్డింగ్ షూట్‌లు అనేవి జంటల మధ్య ప్రేమను, అనుబంధాన్ని సాఫల్యంగా చూపించే అవకాశం. కానీ, అది పరిమితులను దాటి, అసభ్యంగా మారితే సమస్యలు తలెత్తుతాయి. సాంప్రదాయాలను గౌరవించడం, సమాజాన్ని దృష్టిలో ఉంచుకోవడం ఒక్కో జంట బాధ్యత. వినూత్నంగా ఉండాలనుకోవడం తప్పు కాదు కానీ, మితిమీరి, వివాదాస్పదంగా తయారవడం ఎంతోమంది భావోద్వేగాలను దెబ్బతీయడమే కాదు, పెళ్లికి ముందే ప్రతిష్టను దిగజార్చే ప్రమాదం కూడా ఉంటుంది.
கல்யாணத்தைன்னைக்கு வரும் முதல் நைட் தான் முதல் ராத்திரினு நினைச்சா நீயும் என் நண்பனே🤫🤨#Pre #Wedding shoot #Atrocities
— மஞ்சள் 💛 நிலா (@Manjall) June 18, 2025