Good News: మెడికోలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఒకేసారి 15 శాతం పెంచుతూ జీవో జారీ
Good News: మెడికల్, డెంటల్ ఇంటర్న్‌లు, పీజీ విద్యార్థులు, సీనియర్ రెసిడెంట్లకు గౌరవ వేతనాన్ని 15 శాతం పెంచుతూ కొత్త జీవో విడుదల చేసింది.
- By Kavya Krishna Published Date - 07:06 PM, Sun - 29 June 25

Good News: తెలంగాణలో మెడికల్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. మెడికల్, డెంటల్ ఇంటర్న్‌లు, పీజీ విద్యార్థులు, సీనియర్ రెసిడెంట్లకు గౌరవ వేతనాన్ని 15 శాతం పెంచుతూ కొత్త జీవో విడుదల చేసింది. ఈ నిర్ణయం విద్యార్థుల్లో ఆనందాన్ని కలిగించింది. జీవో ప్రకారం, ఇంటర్న్‌లకు నెలవారీ స్టైపెండ్ ఇప్పుడు రూ.29,792గా నిర్ణయించారు. అలాగే, పీజీ డాక్టర్లకు మొదటి సంవత్సరం స్టైపెండ్ రూ.67,032గా, రెండో సంవత్సరం రూ.70,757గా, చివరి సంవత్సరం రూ.74,782గా పెంచారు. సూపర్ స్పెషాలిటీ కోర్సుల విద్యార్థులకు ఫస్ట్ ఇయర్‌లో రూ.1,06,461, సెకండ్ ఇయర్‌లో రూ.1,11,785, థర్డ్ ఇయర్‌లో రూ.1,17,103 చొప్పున స్టైపెండ్ అందనుంది.
Internet: ఇంటర్నెట్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. రాబోయే ఐదేళ్లలో!
ఇంతకుముందు రూ.92,575గా ఉన్న సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనాన్ని కూడా రూ.1,06,461కు పెంచారు. ఈ మేరకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక స్టైపెండ్ పెంపుపై ఆనందం వ్యక్తం చేసిన జూడా సభ్యులు, మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి కృతజ్ఞతలు తెలపనున్నారు. మంత్రి నివాసం సంగారెడ్డిలో ఉండగా, జూడాలు మరికాసేపట్లో అక్కడికి వెళ్లనున్నట్లు సమాచారం.
West Indies Coach: థర్డ్ అంపైర్‌పై నిందలు.. కోచ్‌కు భారీ షాక్ ఇచ్చిన ఐసీసీ!