Papaya: ఈ సమస్యలు ఉన్నవారు బొప్పాయి అస్సలు తినకూడదట.. నిజాలు తెలిస్తే వాటి జోలికే వెళ్లరు!
Papaya: బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే కానీ కొన్ని సమస్యలు ఉండేవారికి ఇది అస్సలు మంచిది కాదని దాని వల్ల లేని పోనీ సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
- By Anshu Published Date - 07:00 AM, Tue - 7 October 25

Papaya: బొప్పాయి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. బొప్పాయి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. తరచుగా బొప్పాయి తీసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. అలా అని ఎక్కువ మొత్తంలో తీసుకోకూడదు. అదేవిధంగా కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకోకపోవడమే మంచిది అని చెబుతున్నారు. మరి బొప్పాయిని ఎవరెవరు తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
స్త్రీలు గర్భవతిగా పండని లేదా సగం పండిన బొప్పాయిని, పచ్చిగా ఉండే బొప్పాయిని తినకూడదని చెబుతున్నారు. ఇందులో లేటెక్స్, పాపెయిన్ అధికంగా ఉంటుందట. ఇవి గర్భాశయంలో సంకోచాలను కలిగిస్తాయట. ఇది అకాల ప్రసవానికి లేదా ఇతర సమస్యలకు దారి తీసే అవకాశముందట. కాబట్టి గర్భిణీ స్త్రీలు బొప్పాయి తినకూడదని చెబుతున్నారు. కాగా బొప్పాయిలో కొన్ని సహజ సమ్మేళనాలు జీవక్రియ సమయంలో హైడ్రోజన్ సైనైడ్ ను విడుదల చేస్తాయట. మాములుగా ఇది హానికరం కాదట. కానీ ఇది గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి ప్రమాదకరంగా ఉంటుందని, కాబట్టి ఎక్కువ బొప్పాయి తినడం వల్ల గుండె సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
అలాగే లేటెక్స్ అలర్జీ ఉంటే బొప్పాయి తినకపోవడమే మంచిదట. వాస్తవానికి బొప్పాయిలో ఉండే ప్రోటీన్లు లేటెక్స్ లో కనిపించే ప్రోటీన్లకు చాలా దగ్గరగా ఉంటాయట. ఆ సమయంలో శరీరం క్రాస్ రియాక్షన్ జరగవచ్చని, దీనివల్ల దురద, తుమ్ములు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయని చెబుతున్నారు. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు బొప్పాయికి దూరంగా ఉండాలట. ఇందులో ఉండే కొన్ని అంశాలు థైరాయిడ్ హార్మోన్ల పనితీరును ప్రభావితం చేస్తాయని, దీనివల్ల అలసట, నీరసం, చలిని భరించలేకపోవడం వంటి లక్షణాలు మరింత తీవ్రమవుతాయని చెబుతున్నారు. అలాగే బొప్పాయిలో విటమిన్ సి ఎక్కువ లభిస్తుందట. సాధారణ ప్రజలకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఇప్పటికే కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి ఇది హానికరం అని చెబుతున్నారు. కాబట్టి ఇప్పటికే కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నవారు బొప్పాయి కీ దూరంగా ఉండటం మంచిదని చెబుతున్నారు.