HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >No Cooking Only Soaking

Boka Saul-Magic Rice: బోకా సౌల్ బియ్యం.. ఇంకా వండాల్సిన పనిలేదు..!

అన్నం వండావా అంటే ఇంకా లేదు.. ఓ 15 నిమిషాలు ఆగండి కుక్క‌ర్ పెడ‌తా అంటారు ఇంట్లో ఆడవాళ్లు. వేళ‌కాని వేళ‌లో మ‌మ్మీ ఆక‌లి అని పిల్ల‌లు అంటే.. ఓ 10 నిమిషాలు ఆగురా వండి పెడ‌తా అంటారు.. ఇక నుంచి ఈ మాట‌లు వినిపించ‌వు.. అంటే అన్నం తినం అని కాదు.. వండ‌దు అని కాదు.. అమ్మ అన్నం అంటే ఇప్పుడే నాన‌పెట్టా.. ఓ అర గంట ఆగు వ‌డ్డిస్తా అంటారు.

  • By Gopichand Published Date - 07:30 AM, Mon - 17 October 22
  • daily-hunt
Ofada Rice 81
Ofada Rice 81

అన్నం వండావా అంటే ఇంకా లేదు.. ఓ 15 నిమిషాలు ఆగండి కుక్క‌ర్ పెడ‌తా అంటారు ఇంట్లో ఆడవాళ్లు. వేళ‌కాని వేళ‌లో మ‌మ్మీ ఆక‌లి అని పిల్ల‌లు అంటే.. ఓ 10 నిమిషాలు ఆగురా వండి పెడ‌తా అంటారు.. ఇక నుంచి ఈ మాట‌లు వినిపించ‌వు.. అంటే అన్నం తినం అని కాదు.. వండ‌దు అని కాదు.. అమ్మ అన్నం అంటే ఇప్పుడే నాన‌పెట్టా.. ఓ అర గంట ఆగు వ‌డ్డిస్తా అంటారు. అవును దేశంలోనే ఉత్ప‌త్తి అవుతున్న ఈ ర‌కం బియ్యం.. మ‌రికొన్ని రోజుల్లోనే దేశంలోని అంద‌రికీ అందుబాటులోకి రానున్నాయి. ఇంత‌కీ ఉడ‌క‌ని.. నాన‌బెడితే అన్నం త‌యార‌య్యే ఈ ర‌కం బియ్యం విశేషాలు ఏంటో చూద్దాం..!

ఈ బియ్యం పేరు బోకా సౌల్. అంద‌రూ ముద్దుగా మ్యాజిక్ రైస్ అంటారు. దీనికి మ‌రోపేరు కూడా ఉంది.. అదే మ‌డ్ రైస్. వీటిని అసోంలోని కొండ ప్రాంతాల్లో పండిస్తున్నారు రైతులు. ఈ పంట సీజ‌న్ జూన్ – డిసెంబ‌ర్ నెల‌. ఈ ఆరు నెల‌లు పంట‌కు అనుకూలం. దొడ్డుబియ్యంలా లావుగా ఉంటాయి. ఈ బియ్యాన్ని పొయ్యిమీద పెట్టి ఉడికించాల్సిన అవ‌స‌రం లేదు. చ‌న్నీళ్ల‌లో ఓ గంట నాన‌బెడితే చాలు.. అన్నం త‌యారు అవుతుంది. చ‌క్క‌గా తినేయొచ్చు. మామూలు అన్నంలాగే ఉంటుంది. ఓ కేజీ మామూలు రైస్ వండితే.. ఎంత ఎక్కువ అన్నం వ‌స్తుందో.. అదే విధంగా ఈ మ్యాజిక్ అలియాస్ మ‌డ్ రైస్ ను నాన‌బెట్టినా అంతే ఎక్కువ వ‌స్తుంది. ఈ పంట పండించ‌టానికి పురుగు మందులు, ర‌సాయ‌న‌క ఎరువులు అవ‌స‌రం లేదు. వీటిని చ‌ల్లితే పంట నాశ‌నం అయ్యే ప్ర‌మాదం ఉంది అంటున్నారు వ్య‌వ‌సాయ శాస్త్ర‌వేత్త‌లు. సో.. గ్యాస్ తో పనిలేదు.. క‌రెంట్ అవ‌స‌రం లేదు.. కుక్క‌ర్లు కొనాల్సిన అవ‌స‌రం లేదు.. జ‌స్ట్ ఓ గంట నాన‌బెడితే చాలు అన్నం త‌యారవుతుంది.

కొన్ని సంవ‌త్స‌రాలుగా మ‌డ్ రైస్, మ్యాజిక్ రైస్ పండిస్తూనే ఉన్నారు అసోం రైతులు. ఇప్పుడు కేంద్ర ప్ర‌భుత్వం దీనికి పేటెంట్ ఇచ్చింది. దీంతో ఈ రైస్ మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. పూర్తి స్వ‌దేశీ ప‌రిజ్ణానంతో ఈ ర‌కం వంగ‌డాన్ని సృష్టించారు వ్య‌వ‌సాయ శాస్త్ర‌వేత్త‌లు. అసోం రాష్ట్ర ప్ర‌జ‌లు పండుగ‌లు, ఫంక్ష‌న్ల‌లో ఈ బియ్యంతో త‌యారైన అన్నాన్నే ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. మొఘ‌ల్ రాజుల కాలంలో ఇలాంటి బియ్యం ఉత్ప‌త్తి జ‌రిగింది. 17వ శ‌తాబ్దంలో సైనికులు ఇదే ఆహారంగా తీసుకునేవారంట‌.

పోష‌క విలువ‌ల మాటేంటీ?

ఈ బియ్యంపై ఇప్ప‌టికే ఎన్నో ప‌రిశోధ‌న‌లు జ‌రిగాయి. ముఖ్యంగా గువాహ‌టి యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌న‌ల్లో బోకా సౌల్ బియ్యం విశిష్ట‌త‌ను వివ‌రించారు. ఈ బియ్యంలో పీచుప‌దార్ధం 11శాతం, మాంస‌కృతులు 7శాతం ఉన్న‌ట్లు తేలింది. ఈ అన్నం వ‌ల్ల శ‌రీరంలో వేడి కూడా త‌గ్గుతుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Boka Rice
  • Boka Saul
  • Magic Rice
  • Soaking

Related News

    Latest News

    • Margashirsha Amavasya: మార్గశిర అమావాస్య.. పితృదేవతల పూజకు విశేష దినం!

    • Airless Tyres: త్వ‌ర‌లో ఎయిర్‌లెస్ టైర్లు.. ఇవి ఎలా ప‌నిచేస్తాయంటే?!

    • Globetrotter Event: వార‌ణాసి టైటిల్ లాంచ్ ఈవెంట్‌కు రాజ‌మౌళి ఎంత ఖ‌ర్చు పెట్టించారో తెలుసా?

    • Antibiotic: యాంటీబయాటిక్ వినియోగం.. అతిపెద్ద ముప్పుగా మారే ప్రమాదం!

    • Sankranthi 2026: టాలీవుడ్‌లో సంక్రాంతి సందడి షురూ.. బాక్సాఫీస్ వద్ద పోటీప‌డ‌నున్న సినిమాలివే!

    Trending News

      • PM Kisan Yojana: ఖాతాల్లోకి రేపే రూ. 2000.. ఈ పనులు చేయకపోతే డబ్బులు రావు!

      • IPL 2026 Auction: ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఈ ఆటగాళ్లు వేలంలోకి ఎందుకు రాలేకపోతున్నారు?

      • Prabhas: జ‌పాన్‌కు వెళ్లనున్న ప్రభాస్.. కారణం ఇదే!

      • Nandamuri Balakrishna : ఏయ్ నువ్వెందుకు వచ్చావ్.. ఎవడు రమ్మన్నాడు.. ఎయిర్‌పోర్టులో బాలకృష్ణ ఫైర్ .. అసలేమైంది?

      • Coach Gambhir: హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రయోగాలు భారత్‌కు భారంగా మారుతున్నాయా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd