Beauty Tips: అవాంచిత రోమాలతో ఇబ్బంది పడుతున్నారా.. చెక్ పెట్టండిలా?
అవాంఛిత రోమాలతో ఇబ్బంది పడేవారు తప్పకుండా కొన్నిహోమ్ రెమెడీస్ ని ఫాలో అవ్వాలని చెబుతున్నారు
- By Anshu Published Date - 03:30 PM, Tue - 17 September 24

మామూలుగా స్త్రీలు అవాంఛిత రోమాల సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటిని తగ్గించుకోవడం కోసం రకరకాల రెమిడీలు ఫాలో అవ్వడంతో పాటు బ్యూటీ పార్లర్ ల చుట్టూ తిరుగుతూ వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉంటారు. ఇలా ఎన్ని చేసినా కూడా కొన్నిసార్లు ఈ అవాంచిత రోమాలు తగ్గడం లేదని దిగులు చెందుతూ ఉంటారు. అయితే వీటిని సహజ సిద్ధంగానే ఇంట్లోనే ఉన్న కొన్నింటిని ఉపయోగించి వాటిని పోగొట్టుకోవచ్చని చెబుతున్నారు. మరి ఇందుకోసం ఏం చేయాలి ఆ ఆయుర్వేద చిట్కాలు ఏంటి అన్న విషయానికి వస్తే..
కర్పూరం తీసుకొని దానిని పొడి చేసి అందులో రెండు తెల్ల స్పూన్లు మిరియాల పొడిని కలవాలి. కాస్త బాదం నూనెను జోడించి పేస్ట్ లా చేసే ముఖానికి అప్లై చేయాలి తర్వాత 15 నిమిషాల పాటు వదిలేయాలి. తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండు నెలల పాటు వారానికి ఒకసారి చొప్పున ఇలా చేస్తూ వెళ్తే మెల్లగా వెంట్రుకలు రావడం తగ్గిపోతుందని చెబుతున్నారు. అలాగే పసుపు, ఉద్ధి పప్పు పొడిచేసి నీళ్లలో కలిపి పేస్ట్ ని సిద్ధం చేసుకోవాలి. దానిని ముఖానికి అప్లై చేయడం వలన అధిక నూనే బయటకు రాదు. ముఖంలోని అవాంఛత రోమాలు కూడా తగ్గుతాయి. అలాగే గుడ్డుని పగలగొట్టి తెల్లసొన మాత్రమే తీసుకొని దానికి కాస్తంత పిండిని కలపాలి.
ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాలు పాటు అప్లై చేసి ఒక పది నిమిషాలు ముఖాన్ని ఆరనివ్వాలి. తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వలన రోమాలు తొలగిపోతాయి. అలాగే పచ్చి బొప్పాయిలో పపైన్ అనే క్రియాశీల ఎంజైమ్ ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలను పరిమితం చేస్తుంది. బొప్పాయి సున్నితమైన చర్మానికి చాలా అనుకూలమైనటువంటిదని చెబుతున్నారు. బొప్పాయి ప్యాక్ కోసం రెండు టేబుల్ స్పూన్లు బొప్పాయి పేస్ట్ , అర టీ స్పూన్ పసుపు పొడిని తీసుకుని పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ తో ముఖాన్ని 15 నిమిషాల పాటు మసాజ్ చేసి నీటితో శుభ్రం చేసుకోవాలి. మంచి ఫలితాలు కోసం వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తే చాలు. ఈ విధంగా పైన చెప్పిన హోమ్ రెమెడీలు ఫాలో అయితే అవంతిత రోమాల సమస్యను ఈజీగా తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.