HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Mount Abu Mound Of Wonders

Mount Abu : మౌంట్ అబూ – అద్భుతాల గుట్ట!!

మౌంట్ అబూ (Mt. Abu) ప్రముఖ చరిత్ర, పురాతన పురాతత్వ ప్రాంతాలు, అధ్భుతమైన వాతావరణం కల్గి ఉండటం వలన రాజస్థాన్ లోని అతి పెద్ద పర్యాటక ఆకర్షణ లలో ఒకటిగా పరిగణింపబడుతున్నది.

  • Author : Vamsi Chowdary Korata Date : 17-10-2023 - 4:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mount Abu Mound Of Wonders!!
Mount Abu Mound Of Wonders!!

Mount Abu : రాజస్థాన్ లోని సిరోహి జిల్లాలో గల మౌంట్ అబూ ఒక వేసవి విడిది (పర్వత ప్రాంతం). ప్రకృతి సౌందర్యం, సౌకర్యవంతమైన వాతావరణం, పచ్చటి కొండలు, దివ్యమైన సరస్సులు, అందంగా నిర్మించిన ఆలయాలు, అనేక ధార్మిక కేంద్రాలకు ఈ ప్రదేశం ప్రసిద్ధి. జైనులకు ఈ ప్రాంతం ఒక ప్రముఖ తీర్థ యాత్ర స్థలం. 1220 మీ. ఎత్తు లో గల ఈ పర్వత కేంద్రం ఆరావళి పర్వత శ్రేణుల లోని ఎత్తైన శిఖరం మీద నెలకొని వుంది. మౌంట్ అబూ (Mt. Abu) ప్రముఖ చరిత్ర, పురాతన పురాతత్వ ప్రాంతాలు, అధ్భుతమైన వాతావరణం కల్గి ఉండటం వలన రాజస్థాన్ లోని అతి పెద్ద పర్యాటక ఆకర్షణ లలో ఒకటిగా పరిగణింపబడుతున్నది. ప్రధానంగా వేసవికాలం, వర్షా కాలంలో వేలాదిమంది పర్యాటకులు, భక్తులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. గత దశాబ్ద౦లొ ఈ పర్వత కేంద్రం ఒక ప్రముఖ వేసవి విడిదిగాను, హనీ మూన్ గమ్యస్థానంగా ప్రజాదరణ పొందింది.

We’re now on WhatsApp. Click to Join.

పురాణాల్లోమౌంట్ అబూ సర్ప దేవత అర్బుద పేరిట ఈ ప్రాంతాన్ని అర్బుదారణ్య అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం శివుని వాహనమైన నందిని రక్షించడానికి సర్పదేవత కిందికి వచ్చాడు. తర్వాతి కాలంలో ‘అర్బుదారణ్య’ పేరు ‘అబూ పర్వత’ లేదా ‘మౌంట్ అబూ’ గా మారింది. ఇక్కడ గుర్జర్లు లేదా గుజ్జర్లు నివసించేవారని, వారికీ అర్బుద పర్వతాలతో అనుబంధ ముండేదని ఈ ప్రాంతానికి చెందిన చారిత్రిక గ్రంధాలు, శాసనాలలో నమోదు చేయబడింది. మౌంట్ అబూ లో చూడ దగిన ప్రదేశాలు. నక్కి సరస్సు, సన్సెట్ పాయింట్, టోడ్ రాక్, ది సిటీ అఫ్ అబూ రోడ్, ది గురు శిఖర్ పీక్, మౌంట్ అబూ వన్యప్రాణి అభయారణ్యం ఈ ప్రాంత౦లొ చూడవలసిన ప్రధాన ఆకర్షణలు.

అనేక చారిత్రక, ధార్మిక ప్రాముఖ్యత కల్గిన ప్రాంతాలలో ప్రధానంగా దిల్వార జైన దేవాలయాలతో బాటుగా అధర్ దేవి ఆలయం, దూద్ బవోరి, శ్రీ రఘునాథ్ జి దేవాలయం, అచల్ ఘర్ కోట వంటి ప్రాంతాలు కూడ మౌంట్ అబూ లో వున్నాయి. మౌంట్ అబూ చేరుకోవడం మౌంట్ అబూ కు చక్కటి రోడ్డు, రైలు, విమాన సౌకర్యం ఉంది. 185 కి. మీ.ల దూరంలో గల ఉదయ్ పూర్ నుండి వాయు మార్గం ద్వార పర్యాటకులు ఇక్కడికి చేరవచ్చు. సంవత్సరం పొడవున వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ వేసవి కాలం ఈ ప్రాంత సందర్శనకు ఉత్తమమైనది.

Also Read:  Wayanad : వాయనాడ్ యొక్క రహస్య సౌందర్యాన్ని కనుగొనడం: కేరళ యొక్క సహజమైన అడవి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • lifestyle
  • Mt. Abu
  • Places
  • rajasthan
  • travel
  • wild life
  • Wonders

Related News

CBI Shocked by the NEET Paper Leak Scandal

NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో షాక్ ఆయన సీబీఐ..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET-UG) 2026 పేపర్ లీకేజీ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. ఈ కుంభకోణం వెనుక భారీ అంతర్రాష్ట్ర నెట్‌వర్క్ ఉన్నట్లు దర్యాప్తులో తేలుతోంది. రాజస్థాన్ నుంచి గురుగ్రామ్, నాసిక్ వరకు దీని మూలాలు విస్తరించి ఉండగా, సీబీఐ విచారణతో కీలక సూత్రధారులు ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు. విచారణ అధికారుల కథనం ప్రకారం రాజస్థాన్‌లోని జమ్వా రామ్

    Latest News

    • Donald Trump: డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన

    • హైదరాబాద్‌లో మరో నేపాలీ గ్యాంగ్.. భారీ దోపిడీ

    • Pawan Kalyan: నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక

    • Gold Imports: బంగారం,వెండి పై సుంకాలు రెట్టింపు చేసిన కేంద్రం…

    • Mouni Roy: విడాకులు తీసుకోబోతున్న మౌనీ రాయ్?

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd