Mint Leaves Face Pack : పుదీనా ఫేస్ ప్యాక్.. ఒక్కవారంలోనే ఈ మార్పు ఖాయం..
- By News Desk Published Date - 08:49 PM, Sat - 18 May 24

Mint Leaves Face Pack : పుదీనా.. వంటల్లో దీనిని వాడితే.. ఆ రుచే వేరు. వంటల్లోనే కాదు.. కొన్ని ఆయుర్వేద ఔషధాల్లోనూ దీనిని వాడుతారు. ఇందులో సహజంగానే యాంటీబయాటిక్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఆరోగ్యానికే కాదు.. చర్మాన్ని కూడా సంరక్షించే గుణం పుదీనా ఆకులకు ఉంది. ముఖ్యంగా ముఖంపై మొటిమలు, మచ్చలను తొలగించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. పుదీనాతో కొన్నిరకాల ఫేస్ ప్యాక్ లను ఒక్క వారంరోజులపాటు ట్రై చేసి చూడండి. కచ్చితంగా మీ ముఖంలో మార్పు వస్తుంది.
దోసకాయ – పుదీన ఫేస్ ప్యాక్
సన్నగా తరిగిన పుదీనా ఆకులు, అరకప్పు దోసకాయ ముక్కల్ని కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకుని.. ముఖానికి అప్లై చేయాలి. 15 నుంచి 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి. వారంపాటు ఇలా చేస్తే.. మొటిమలు, బ్లాక్ హెడ్స్ క్రమంగా తగ్గుతాయి.
రోజ్ వాటర్ – పుదీనా ఫేస్ ప్యాక్
పుదీనా ఆకుల్లో కొద్దిగా రోజ్ వాటర్ వేసి మొటిమలు, మచ్చలపై రాయాలి. 10 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే.. మొటిమలు తగ్గుతాయి.
ముల్తానీ మట్టి – పుదీనా ఫేస్ ప్యాక్
పుదీనా ఆకుల్ని మెత్తగా గ్రైండ్ చేసి.. ఒక స్పూన్ ముల్తానీ మట్టి, రోజ్ వాటర్ కలిపి పేస్ట్ ని ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి.
కేవలం ఇవే కాదు.. కొబ్బరినూనె – ఆముదం కలిపి రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసి.. ఉదయాన్నే వాష్ చేసుకోవాలి. ఇలా చేస్తే.. ముఖంపై ముడతలు, సన్నటి గీతలు తొలగిపోతాయి. వేసవి ఎండకు ట్యాన్ అయిన ఫేస్.. మళ్లీ మునుపటి కాంతిని పొందుతుంది. మొటిమలు కూడా తగ్గే అవకాశం ఉంది.