Men Food: అబ్బాయిలు ఈ ఆహార పదార్థాలు తినకూడదట.. తింటే ఇక అంతే సంగతులు?
మనిషి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి అంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవాలి.
- By Anshu Published Date - 07:30 AM, Wed - 12 October 22

మనిషి ఆరోగ్యంగా,ఆనందంగా ఉండాలి అంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవాలి. మంచి పోషకాలు మన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండడవచ్చు. అయితే మనం తెలిసి తెలియక కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటాం. అందులో ముఖ్యంగా మగవారు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలట. మరి ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సోయాబీన్స్ లో ఉండే ఫైటో ఈస్ట్రోజెన్లు ప్రాథమికంగా మొక్కల నుంచి వచ్చే ఈస్ట్రోజన్ లాంటి సమ్మేళనాలు. వీటిని తీసుకోవడం వల్ల పురుషులకు హాని చేస్తాయి.
ఈ ఫైటో ఈస్ట్రోజెన్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీర హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుందట. సోయాబీన్స్ ను అతిగా తినడం వల్ల స్పెర్మ్ సాంద్రత కూడా బాగా తగ్గుతుందట. ట్రాన్స్ ఫ్యాట్స్ పురుషులతో పాటు మహిళలు కూడా తినడం అంత మంచిది కాదు. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్, చేయించిన ఆహార పదార్థాలలో ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ట్రాన్స్ ఫ్యాట్స్ ని తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం మరింత అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మగవారిలో స్పెర్మ్ కౌంట్ కూడా చాలా వరకు తగ్గిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రాసెస్ చేసిన మాంసాహారాన్ని తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇవి క్రమైనా పురుషుల ఆరోగ్యం దారుణంగా దెబ్బతీస్తాయి.
ఈ విధంగా ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువగా తింటే పురుషులలో స్పెర్మ్ కౌంటు తగ్గిపోతుంది. అలాగే పురుగుల మందులు వాడని కురగాయలు చాలా తక్కువగా లభిస్తాయిని చెప్పవచ్చు. పురుగు మందుల రసాయనాలు, బిపిఎ జెనో ఈస్ట్రోజెన్ల లాగే పనిచేస్తాయి. జెనో ఈస్ట్రోజెన్ లు, ఈస్ట్రోజెన్ ను అనుకరించే రసాయనాలు. సోయాబీన్స్ కనిపించే ఫైటోఈస్ట్రోజెన్ల లాగానే జినోఈస్ట్రోజెన్లు కూడా స్పెర్మ్ కౌంట్ పై ప్రభావితం చూపిస్తాయి. అలాగే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉండే పాల ఉత్పత్తులు పురుషుల ఆరోగ్యానికి అసలు మంచివి కావు. కొవ్వు ఎక్కువగా ఉండే పాల ఉత్పత్తులు అయినా జున్ను పాలు వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల నాణ్యతలేని స్పెర్మ్, స్పెర్మ్ కౌంట్ తక్కువ వంటి సమస్యలు మగవారిలో తలెత్తుతాయి.