Curd: కేవలం ఒక చెంచా పెరుగుతూ ముఖాన్ని, జుట్టుని షైనీగా మార్చుకోండిలా?
Curd: కేవలం ఒక స్పూన్ పెరుగుతో ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే ముఖంతో పాటు జుట్టును కూడా అందంగా షైనిగా మెరిపించుకోవచ్చు అని చెబుతున్నారు. మరి అందుకోసం పెరుగుతో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
- By Anshu Published Date - 07:02 AM, Mon - 10 November 25
Curd: మామూలుగా ప్రతి ఒక్కరి ఇంట్లో పెరుగు తప్పనిసరిగా ఉంటుంది. పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. తరచుగా పెరుగు తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే పెరుగు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా జుట్టు అందానికి కూడా ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు.. మరి పెరుగుతో ఏం చేస్తే ముఖం అందంగా మెరిసిపోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ముఖానికి మెరుపు ఇచ్చేందుకు పెరుగు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక గిన్నెలో కప్పు పెరుగు అందులో చిటికెడు పసుపు, కొద్దిగా శనగపిండి వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నుంచి 20 నిమిషాల పాటు బాగా ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడిగేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే ముఖం మెరిసిపోవడం ఖాయం అని చెబుతున్నారు. జిడ్డు చర్మం ఉన్నవారికి పెరుగుతో చేసిన స్క్రబ్ చాలా మంచిదట. ఈ స్క్రబ్ చేయడానికి, పెరుగులో బియ్యం పిండి, చిటికెడు పసుపు కలిపి ముఖానికి పట్టించి, నెమ్మదిగా మసాజ్ చేయాలట. కాసేపు ఆరనిచ్చి, ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయాలట. జిడ్డు చర్మం ఉన్నవారు రోజూ ముఖానికి పెరుగును ఉపయోగించవచ్చట. అంతేకాకుండా ముఖ సమస్యలు ఉన్నవారికి పెరుగు చాలా మంచిదట.
పెరుగు చర్మాన్ని ప్రకాశవంతంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుందట. తలస్నానం చేసేటప్పుడు షాంపూకి ముందు జుట్టుకు పెరుగు బాగా పట్టించాలట. దీనివల్ల జుట్టుకు ప్రోటీన్ అందుతుందట. ముఖ్యంగా పొడి జుట్టు ఉన్నవారికి పెరుగు చాలా మంచినీ చెబుతున్నారు. పెరుగు జుట్టును మృదువుగా మార్చడంలో సహాయపడుతుందట. జుట్టు కోసం ఖరీదైన షాంపూలకు బదులుగా పెరుగును ఉపయోగించడం అన్ని విధాలా ఉత్తమం. ఇది జుట్టును మృదువుగా మార్చడమే కాకుండా, తల చర్మాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుందనీ చెబుతున్నారు.