HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Know The Beauty Benefits Of Potato

Potato: బంగాళాదుంప యొక్క సౌందర్య ప్రయోజనాలను తెలుసుకోండి

బంగాళాదుంపతో చేసే కూరలన్నా, వంటకాలన్నా మనలో చాలామందికి ఫేవరెట్‌.

  • Author : Maheswara Rao Nadella Date : 22-02-2023 - 8:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Potatoes Benefits
Know The Beauty Benefits Of Potato

బంగాళాదుంపతో (Potato) చేసే కూరలన్నా, వంటకాలన్నా మనలో చాలామందికి ఫేవరెట్‌. ఆలూ చిప్స్‌, ఫ్రెంచ్ ఫ్రైస్‌, బంగాళాదుంప (Potato) ఫ్రై ఇలా ఏది చేసినా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. బంగాళదుంపలో పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్‌, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆలూ ఆరోగ్యానికే కాదు.. మీ అందాన్ని రెట్టింపు చేయడానికీ సహాయపడుతుంది. బంగాళదుంపు డార్క్‌ స్పాట్స్‌, టాన్‌ని తొలగించడంలో సహాయపడుతుంది. డార్క్‌ సర్కిల్స్‌ను సులభంగా మాయం చేస్తుంది. ముఖానికి గ్లో అందిస్తుంది. ఆలూ వృద్ధాప్య ఛాయలను తొలగిస్తుంది. బంగాళదుంపలోని యాంటీఆక్సిడెంట్లు, గ్లో-ఇండ్యూసింగ్ విటమిన్లు A, B, C ముడతలు, గీతలను దూరం చేస్తాయి. బంగాళదుంపోలో జింక్, సల్ఫర్, రాగి వంటి మినరల్స్‌ ఉంటాయి.ఇవి మొటిమలను నియంత్రించడంలో, చర్మం నుంచి టాక్సిన్స్‌ తొలగించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. బంగాళదుంపను మీ స్కిన్‌కేర్‌ రొటీన్‌లో ఎలా యాడ్‌ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ప్రకాశవంతమైన చర్మం కోసం:

బంగాళదుంపలోని విటమిన్‌ సీ.. చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడమే కాకుండా, దీనిలో యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా రక్షిస్తాయి. సగం బంగాళాదుంప పేస్ట్‌, 1 టేబుల్ స్పూన్ శెనగపిండి, 1 టీస్పూన్ నిమ్మరసం కలిపి పేస్ట్‌లా రెడీ చేయండి. దీన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ముఖం ఆరిన తర్వాత మాయిశ్చరైజర్‌ అప్లై చేయండి. ఈ ప్యాక్‌ ముఖానికి ఇన్‌స్టెంట్‌ గ్లో ఇస్తుంది.

ఫేస్‌ స్క్రబ్‌:

ఆలూలో స్వల్పంగా ఎసిడిక్‌ గుణాలు ఉంటాయి. ఇది చర్మంపై పేరుకున్న మృతకణాలను తొలగించి తాజాగా మారుస్తుంది. మీరు పేస్‌ స్క్రబ్‌ రెడీ చేసుకోవడానికి.. అర టీస్పూన్ వోట్ మీల్ పౌడర్‌, అర టీస్పూన్ పాలు, సగం బంగాళాదుంప గుజ్జును మిక్స్‌ చేసి పేస్ట్‌లా రెడీ చేసుకోండి. దీనితో.. 8 నుంచి 10 నిమిషాల పాటు స్క్రబ్‌ చేయండి. ఓట్స్‌, బంగాళదుంపు ఎక్స్‌ఫోలియేటర్స్‌గా పనిచేస్తాయి. పాలలో లాక్టిక్‌ యాసిడ్ చర్మంలోని టాక్సిన్స్‌ను తొలగిస్తుంది. మీ చర్మానికి తేమను అందిస్తుంది.

మొటిమలు మచ్చలు తగ్గాలంటే:

బంగాళాదుంపలో కాటెకోలేస్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మొటిమల మచ్చలు, పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది. మీరు ఈ సమస్యలతో బాధపడుతుంటే.. అర టీస్పూన్ బంగాళాదుంప రసం తీసుకుని అందులో పావు టీస్పూన్ టొమాటో రసం, అర టీస్పూన్ తేనె కలపాలి. దీన్ని ప్రభావిత ప్రాంతంపై అప్లై చేసి.. 20 నుంచి 30 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. మంచి రిజల్ట్స్‌ కోసం కనీసం వారానికి ఒకసారైనా అప్లై చేసుకోవాలి.

డార్క్‌ సర్కిల్స్‌ మాయం:

డార్క్‌ సర్కిల్స్‌, కంటి స్ట్రెస్‌ను తగ్గించడానికి బంగాళదుంప ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. మీరు డార్క్‌ సర్కిల్స్‌తో బాధపడుతుంటే.. ఆలూను స్లైస్‌గా కట్‌ చేసి ఆ ముక్కలకు కలబంద గుజ్జు రాసి, వాటిని కళ్లపై పెట్టుకోండి. 20 నిమిషాల పాటు రిలాక్స్‌ అవ్వండి. ఇవి డార్క్‌ సర్కిల్స్‌ తగ్గించడమే కాదు, కళ్లను రిలాక్స్‌ చేస్తాయి. ఫ్రెష్ లుక్ కోసం ప్రతి రోజు ఈ రెమెడీని ప్రయత్నించండి.

మచ్చలు మాయం:

ముఖంపై మచ్చలు ఏర్పడి, వృద్ధాప్య ఛాయలు కనిపిస్తే, సగం బంగాళాదుంప రసం తీసుకుని అందులో రెండు చెంచాల పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని కాటన్ సహాయంతో మీ ముఖం ,మెడపై అప్లై చేయండి. అరగంట పాటు ఆరనిచ్చి.. నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. దీన్ని వారానికి రెండుసార్లు అప్లై చేస్తే.. మచ్చలు తగ్గి ముఖం యవ్వనంగా కనిపిస్తుంది.

Also Read:  Lungs Health: ఈ అల్లం – ములేతి టీ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • beauty
  • benefits
  • health
  • Life Style
  • potato
  • tips
  • Tricks

Related News

Gut Health

Gut Health: పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.. తినాల్సిన ఫుడ్స్

Gut Health మన పేగులు ఆహారాన్ని జీర్ణం చేయడంలో సాయపడటమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో, శరీర శక్తిని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఆరోగ్యకరమైన గట్ హెల్తీ లైఫ్‌స్టైల్‌కు సంకేతం. అయితే, కొన్నిసార్లు పేలవమైన ఆహారపు అలవాట్లు, అధిక ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలి పేగు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే సరైన పోషకాహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన పేగును

  • Asia Book Of Records

    Asia Book of Records : ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో డానోన్ ఇండియా

  • Fatty Liver Stages

    Fatty Liver: సన్నగా ఉన్నవారిలో కనిపించే ఫ్యాటీ లివర్ గురించి నిపుణులు చెబుతున్న షాకింగ్ నిజాలివే!

  • Brain Damage

    నిద్ర లేక‌పోతే బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందా?

Latest News

  • Nara Lokesh: జగన్ కు నారా లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!!

  • Jewar Airport : ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయానికి ప్రధాని మోడీ శ్రీకారం!

  • Special Train: రాజమండ్రి-కాకినాడ పోర్ట్ స్పెషల్ ట్రైన్: దగ్గుబాటి పురందేశ్వరి

  • వాహనదారులకు బిగ్ అలర్ట్..ఇకపై 15 రోజులకు ఓసారి పెట్రోల్ , డీజిల్ ధరల్లో మార్పులు

  • AP Health And Wellness: ఏపీ పాఠశాలల్లో హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ ప్రోగ్రాం

Trending News

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd