HashtagU Telugu
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Life Style News
  • ⁄Keep Distance From These Things After The Age Of 30

Lifestyle for Slow Ageing: మిమ్మల్ని 30 ఏళ్లకే ముసలోళ్లు చేసే ఫుడ్స్ ఇవీ..!

30 ఏళ్ల వయసు (Age Of 30) తర్వాత ఈ విషయాలకు మీరు దూరంగా ఉండండి.. లేదంటే సమయానికి ముందే వృద్ధులలాగా కనిపించడం ప్రారంభిస్తారు. అందుకే బీ అలర్ట్.

  • By Gopichand Published Date - 01:23 PM, Tue - 24 January 23
Lifestyle for Slow Ageing: మిమ్మల్ని 30 ఏళ్లకే ముసలోళ్లు చేసే ఫుడ్స్ ఇవీ..!

30 ఏళ్ల వయసు (Age Of 30) తర్వాత ఈ విషయాలకు మీరు దూరంగా ఉండండి.. లేదంటే సమయానికి ముందే వృద్ధులలాగా కనిపించడం ప్రారంభిస్తారు. అందుకే బీ అలర్ట్.

30 ఏళ్లు దాటిన తర్వాత మనిషి శరీరంలో జీవక్రియ మందగించడం ప్రారంభమవుతుంది. ఈ టైంలో ఉప్పు, నూనె, మసాలాలు, చక్కెరలు తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. మీరు ఇప్పటికీ యుక్తవయస్కుడిగా లేదా 20 ఏళ్ల వయస్సులో ఉన్నట్లు అనిపించవచ్చు. కానీ నిజం ఏమిటంటే.. 30 తర్వాత మీ శరీరంలో చాలా మార్పులు జరగడం ప్రారంభిస్తాయి. ఆ తర్వాత మీరు మునుపటిలా ఫిట్‌గా ఉండటం కొంచెం కష్టమవుతుంది. అందుకే 30 ఏళ్ల తర్వాత ఫుడ్, జీవనశైలిలో కొన్ని మంచి మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. తద్వారా పెరుగుతున్న వయస్సు కూడా మీకు పెద్దగా హాని కలిగించదు. ఈ కథనంలో మీ శరీరంలో వృద్ధాప్య సంకేతాలను పెంచే ఫుడ్స్ గురించి
తెలుసుకుందాం..!

ఫ్లేవర్డ్ పెరుగు & యోగర్ట్

చాలామంది ప్రజలు తీపి వస్తువులకు దూరం అనే పేరుతో ఐస్‌క్రీం, స్వీట్లు, మిఠాయిలు, కుకీలు వంటి వాటికి దూరంగా ఉంటారు. ఇది నిజానికి తమను తాము మోసం చేసుకోవడం లాంటిది. నిజానికి బ్రెడ్, కెచప్ , ఫ్లేవర్డ్ పెరుగు వంటివి స్వీట్ ఫుడ్స్ యొక్క మూలాలు . మనం వాటిని తింటూ.. స్వీట్లు తినడం లేదని అనుకుంటాము.  పెరుగులో.. ఐస్ క్రీం గిన్నెలో ఉన్నంత చక్కెర ఉంటుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

క్యాన్డ్ సూప్

రోజుకు ఐదు గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు ఏ వ్యక్తికైనా ప్రమాదకరం. ప్రతి ఒక్కరూ రోజంతా 2,300 గ్రాముల కంటే తక్కువ సోడియం తీసుకోవాలి. అయితే క్యాన్డ్ సూప్ ఒకసారి తీసుకుంటే.. మొత్తం రోజంతా అవసరమైన సోడియంలో 40 శాతం మీ బాడీ లోపలకి వెళ్తుంది. ఈ విధంగా మీరు రోజుకు రెండు నుండి మూడు సార్లు తీసుకుంటే.. శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ సోడియం లభిస్తుంది. ఇది మాత్రమే కాదు, చాలా సూప్‌లలో BPA అనే ​​రసాయనం కూడా ఉంటుంది. ఇది క్యాన్సర్, వంధ్యత్వం, బరువు పెరగడానికి కూడా కారణం అవుతుంది. అందుకే ఇంట్లోనే క్యాన్డ్ సూప్ తయారు చేసి తాగడం బెస్ట్.

కూల్ డ్రింక్స్

కూల్ డ్రింక్స్ ను మీ శత్రువుగా పరిగణించండి. కొన్ని కూల్ డ్రింక్స్ లలో క్యాన్సర్ ను కలిగించే రంగులు (ఫుడ్ కలర్స్) ఉపయోగించబడతాయి. అవి శరీరానికి అదనపు చక్కెరను అందిస్తాయి. ఇంత భారీగా షుగర్ అందితే.. మహిళల్లో అండోత్సర్గ ప్రక్రియ నెగెటివ్ గా ప్రభావితం అవుతుంది. పురుషుల స్పెర్మ్‌లపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఇది గర్భధారణను సైతం కష్టతరం చేస్తుంది.

కాక్‌టెయిల్‌, బీర్

వయసు పెరిగే కొద్దీ మన శరీరాలు ఆల్కహాల్‌ను సరిగ్గా జీర్ణం చేసుకోలేవు. అందుకే వయసు పెరిగే కొద్దీ మద్యానికి దూరంగా ఉండటం మంచిది. ఆల్కహాల్ అనేక విధాలుగా శరీరానికి హాని కలిగిస్తుంది. 20 నుంచి 30 సంవత్సరాల వయస్సులో మీ శరీరం ఎలా పని చేస్తుందో.. అది 30 తర్వాత చేయలేదని మీరు అంగీకరించాలి.

వైట్ బ్రెడ్

చాలామంది టిఫిన్ లో వైట్ బ్రెడ్ ను తింటుంటారు. అయితే దాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతుంది. ఇందులో అధిక మొత్తంలో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ ఉంటాయి. ఇది శరీరంలో కొవ్వు రూపంలో పేరుకుపోతుంది. వైట్ బ్రెడ్ రక్తంలో చక్కెర మోతాదును కూడా పెంచుతుంది.

హై సోడియం ఉండే చైనీస్ ఫుడ్

అధికంగా సోడియం ఉండే చైనీస్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. ఒకవేళ వీటిని ఎక్కువగా తింటే.. మీ చర్మంపై తేమ తగ్గిపోతుంది. మీ రక్తపోటు పెరుగుతుంది.  పొడి, నిర్జీవమైన చర్మం వల్ల మీరు కనీసం 40 ఏళ్ల కంటే ముందే ముసలివాళ్ళలా కనిపించడం మొదలుపెడతారు.

ఐస్‌డ్ కాఫీ

ఐస్‌డ్ కాఫీ తాగితే.. మీ చర్మాన్ని రెట్టింపు వేగంగా ముసలితనం ఛాయలు కమ్మేస్తాయి. పగటిపూట మన చర్మంపై హానికరమైన UV కిరణాలు పడుతాయి. ఇవి చర్మాన్ని దెబ్బతీస్తాయి. నిద్రపోతున్నప్పుడు మన శరీరం , దాని కణాలు తమను తాము రిపేర్ చేస్తాయి. కాఫీలోని కెఫీన్ నిద్రకు భంగం కలిగిస్తుంది . కాబట్టి రాత్రిపూట నిద్రపోయే ముందు కాఫీ తాగొద్దు. ఒకవేళ తాగితే మీరు నిద్రించాక శరీరం తన పనిని తాను చేయడం కష్టతరం అవుతుంది.

ఎక్కువ కాలం స్టోర్ చేసి ఉంచేవి

చక్కెర రహిత ఆహారాలు, క్యాన్డ్ ఫ్రూట్స్, బరువు తగ్గించే బార్‌లు, ఘనీభవించిన ఆహారం, ప్రాసెస్ చేసిన వేరుశెనగ, వెన్న, స్పోర్ట్స్ డ్రింక్స్, చిప్స్, వేఫర్‌లు , క్యాన్డ్ కాఫీ క్రీమ్ వంటివి స్టోర్‌లలో సంవత్సరాల తరబడి ఉంచబడతాయి. ఇవి మీ వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తాయి.  అందుకే వాటి నుంచి దూరం పాటించడం చాలా ముఖ్యం.

Telegram Channel

Tags  

  • cool drinks
  • lifestyle
  • Lifestyle for Slow Ageing
  • Lifestyle News

Related News

Zodiac Signs: 2023లో ఈ రాశుల వాళ్ల అదృష్టం అదుర్స్!!

Zodiac Signs: 2023లో ఈ రాశుల వాళ్ల అదృష్టం అదుర్స్!!

అయితే రాబోయే 2023 సంవత్సరం కొన్ని రాశుల వారికి బాగా కలిసొచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఆ రాశులు ఏమిటి ?

  • Rainbow Diet : ఈ వెరైటీ డైట్ పాటిస్తే…ఆ వ్యాధులకు దూరంగా ఉంటారు..!!

    Rainbow Diet : ఈ వెరైటీ డైట్ పాటిస్తే…ఆ వ్యాధులకు దూరంగా ఉంటారు..!!

  • Breakfast Recipes : మిల్లేట్స్ దోశ ఎప్పుడైనా టేస్ట్ చేశారా..? షుగర్ పేషంట్లకు ఎంతో మేలు చేస్తుంది..!!

    Breakfast Recipes : మిల్లేట్స్ దోశ ఎప్పుడైనా టేస్ట్ చేశారా..? షుగర్ పేషంట్లకు ఎంతో మేలు చేస్తుంది..!!

  • Sunscreen and Moisturizer : సన్‌స్క్రీన్ , మాయిశ్చరైజర్ మధ్య తేడా తెలుసా?

    Sunscreen and Moisturizer : సన్‌స్క్రీన్ , మాయిశ్చరైజర్ మధ్య తేడా తెలుసా?

  • Pregnancy : ప్రెగ్నెన్సీ సమయంలో పుట్టగొడుగులు తినవచ్చా…?

    Pregnancy : ప్రెగ్నెన్సీ సమయంలో పుట్టగొడుగులు తినవచ్చా…?

Latest News

  • Who Is Raja Chari: భారత సంతతికి అమెరికా వైమానిక దళంలో కీలక పదవి.. ఎవరీ రాజా జె చారి..?

  • Taliban Bans: మహిళలపై మరో నిషేధం విధించిన తాలిబన్లు.. ఈసారి ఏంటంటే..?

  • Bachula Arjunudu: గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన టీడీపీ ఎమ్మెల్సీ

  • Migraines : మైగ్రేన్ తో డెంటల్ ప్రాబ్లమ్స్ కు లింక్ ఉందా?

  • IND vs NZ: నేడే రెండో టీ20.. టీమిండియాకు డూ ఆర్ డై మ్యాచ్

Trending

    • Reverse Aging: ఎలుకల్లో ‘రివర్స్ ఏజింగ్’.. ఇక మనుషులే తరువాయి!

    • Indian Flag : జ‌న‌వ‌రి 26 , ఆగ‌స్ట్ 15 వేడుక‌ల్లో త్రివ‌ర్ణ ప‌తాకం ప్రోటోకాల్ ఇలా..!

    • Bad Cholesterol : శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ భరతం పట్టే ఫ్రూట్స్ ఇవే..

    • Hello Alexa: సల్లూ భాయ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ? అలెక్సాపై వెరైటీ ప్రశ్నల వర్షం!

    • ChatGPT : చాట్‌ జీపీటీని ఢీకొనేందుకు గూగుల్ స్పారో..

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: