Indigestion – Cancer : అజీర్తి సమస్య వేధిస్తోందా ? పారాహుషార్ !
Indigestion - Cancer : చాలామంది తిన్న ఆహారం అరగక ఇబ్బందిపడుతుంటారు. ఈ ప్రాబ్లమ్‌ను తేలిగ్గా తీసుకుంటారు.
- Author : Pasha
Date : 25-10-2023 - 7:47 IST
Published By : Hashtagu Telugu Desk
Indigestion – Cancer : చాలామంది తిన్న ఆహారం అరగక ఇబ్బందిపడుతుంటారు. ఈ ప్రాబ్లమ్‌ను తేలిగ్గా తీసుకుంటారు. అజీర్తి సమస్యల వల్ల శక్తి, పోషకాలు మన శరీర అవయవాలకు అందవని గ్రహించరు. దీని పర్యవసానంగా శక్తి అందక శరీర అవయవాలు నీరసపడతాయి. ఎక్కువ రోజులపాటు అజీర్తి సమస్య కొనసాగితే ఎంత రిస్క్ ఉంటుందో అర్థం చేసుకోలేరు. అజీర్తి సమస్యలు పెద్ద పేగు క్యాన్సర్‌కు కూడా దారితీసే రిస్క్ ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. అజీర్తి.. ఒకవేళ పెద్ద పేగు క్యాన్సర్‌కు దారితీసే ముప్పు ఉంటే కొన్ని సంకేతాలు బయటపడతాయి. అవేమిటంటే.. పొట్ట కింద నొప్పిగా ఉంటుంది. మల విసర్జన టైంలో నొప్పి వస్తుంది. రక్తస్రావం జరుగుతుంది. బరువు తగ్గిపోతారు. తీవ్ర అలసట వస్తుంది. విరేచనాలు కలుగుతాయి. పొట్ట బిగబట్టినట్టు అవుతుంది.ఈ డేంజర్ సిగ్నల్స్ కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను(Indigestion – Cancer) సంప్రదించాలి.
We’re now on WhatsApp. Click to Join.
అజీర్తి సమస్య రాకుండా ఏం చేయాలి ?
- తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి.
- అధిక మసాలాలు, కారం దట్టించిన ఆహారాన్ని తినకపోవడమే మంచిది.
- తేలికపాటి పండ్లు, కూరగాయలు వంటివి తీసుకోవాలి.
- రాత్రి భోజనాన్ని ఎనిమిది గంటల్లోపే పూర్తి చేయాలి.
- నిద్రపోవడానికి, భోజనం తినడానికి మధ్య కనీసం గంటన్నర నుంచి రెండు గంటల గ్యాప్ ఉండడం ముఖ్యం.
- యోగా, వాకింగ్ వంటివి చేయాలి.
- తిన్న వెంటనే నిద్రపోకూడదు.
Also Read: Rahul Gandhi – Satya Pal Malik : సత్యపాల్‌ను ఇంటర్వ్యూ చేసిన రాహుల్.. సంచలన ఆరోపణలతో దుమారం