Winter: చలికాలంలో చర్మం పగలకుండా ఉండాలంటే ఏం చేయాలో మీకు తెలుసా?
చలికాలంలో చర్మం పగలకుండా ఉండాలంటే తప్పకుండా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.
- By Anshu Published Date - 11:02 AM, Mon - 2 December 24

చలికాలం మొదలయింది. రోజురోజుకీ చలి తీవ్రత పెరుగుతూనే ఉంది. అయితే ఏం చలికాలంలో దురయ్యే ప్రధాన సమస్యల్లో చర్మం పగలడం సమస్య కూడా ఒకటి. చర్మం పగలడం కారణంగా మంటగా అనిపించడం కొన్ని కొన్ని సార్లు దురదగా కూడా అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సరైన పద్ధతులు పాటించాలి. దీనితో పాటు చర్మానికి పోషణను అందించడం చాలా అవసరం. చలికాలంలో చాలా తక్కువగా నీరు తాగుతారు. దీంతో చర్మం పొడిబారుతుంది. అందుకే చలికాలంలో ఎక్కువ నీరు తాగడం వల్ల మీరు హైడ్రేటెడ్ గా ఉంటారట. పగటిపూట నీరు పుష్కలంగా తాగినప్పుడు చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు. అయితే చర్మ ఆరోగ్యానికి ముప్పు కలిగించే టాక్సిన్స్ తొలగిపోతాయి. చలికాలంలో చర్మాన్ని ఉంచేందుకు రోజూ నీరు, హెర్బల్ టీలను తీసుకోవచ్చు.
అలాగే చర్మానికి సన్ స్క్రీన్ లను అప్లై చేయాలట. చలికాలంలో చాలా మంది సన్‌స్క్రీన్‌లను వాడరు. వాతావరణం చల్లగా ఉన్నా, సూర్యరశ్మి లేని సమయంలో కూడా యువి కిరణాలు చర్మాన్ని తాకుతూనే ఉంటాయి. దీంతో చర్మ సమస్యలు ఎక్కువ అవుతాయి. వృద్ధాప్య ఛాయలు కూడా కనబడతాయి. కాబట్టి కనీసం సన్‌స్క్రీన్‌ని అప్లై చేయడం మంచిది. చలికాలంలో చర్మానికి హైడ్రేటింగ్ లేదా క్రీమ్ క్లెన్సర్‌ని అప్లై చెయ్యాలి. ఇది నాన్-ఫోమింగ్. ఇవి వాడటం వల్ల చర్మం దాని సహజ తేమను బయటకు పంపదు. ఇందులో ఉండే గ్లిజరిన్ లేదా సిరామైడ్ లు తేమను ఎక్కువసేపు ఉంచడంలో సహాయపడతాయట. హైలురోనిక్ యాసిడ్, షియా బటర్ లేదా స్క్వాలేన్ అధికంగా ఉన్న మాయిశ్చరైజర్లు చర్మానికి రాసుకోవాలట. ఇవి చర్మంలోకి లోతుగా చేరి తేమను అందించడంలో సహాయపడతాయని, శీతాకాలంలో మాయిశ్చరైజర్, సీరమ్ మిశ్రమాన్ని ఉపయోగించడం బెస్ట్ ఆప్షన్ అని చెబుతున్నారు.
శీతాకాలంలో గాలి వాతావరణం చాలా పొడిగా ఉంటుంది. ఇది డ్రై స్కిన్ సమస్యకు దారితీస్తుంది. కానీ హ్యూమిడిఫైయర్లు గదిలో తేమ తక్కువగా ఉన్నప్పుడు.. చాలా అద్భుతంగా పనిచేస్తాయి. చర్మానికి కావాల్సిన తేమను అందిస్తాయి. హ్యూమిడిఫైయర్లు చర్మం తేమగా ఉండటానికి చాలా బాగా ఉపయోగపడతాయట.రాత్రి నిద్రిస్తున్నప్పుడు కూడా చర్మం తేమగా ఉండేలా పనిచేస్తాయట. చలికాలంలో వారానికి ఒకటి లేదా రెండుసార్లు సున్నితమైన హైడ్రేటింగ్ మాస్క్‌ను అప్లై చేసకోండి. దీని వల్ల మీ చర్మం తేమగా ఉంటుంది. హైడ్రేటింగ్ మాస్క్ కోసం తేనె, కలబంద లేదా దోసకాయ వంటి వాటిని ఉపయోగించాలట. ఇది స్కిన్ ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. చర్మాన్ని తేమగా ఉంచుతుంది. శీతాకాలంలో ప్రతి ఏడు రోజులకు ఒకసారి హైడ్రేటింగ్ మాస్క్ వేసుకోవడం మంచిదని చెబుతున్నారు.