Beauty Tips : ఇలా చేస్తే పులిపిర్లు మటుమాయం..!!
- By hashtagu Published Date - 09:43 AM, Wed - 16 November 22
కొంతమందికి అందమైన ముఖంపై పులిపిర్లు వస్తుంటాయి. చూడాటానికి ఇబ్బందిగా కనిపిస్తాయి. మరికొందరికి మెడచుట్టూ వస్తుంటాయి. వయస్సుతో సంబంధం లేకుండా ఏర్పడుతుంటాయి. వాటి ఆకారంలోనూ విభిన్నంగగా ఉంటాయి. అయితే ముఖంపై కానీ శరీరంపై కానీ పులిపిర్లు ఏర్పడగానే చాలా కంగారు పడుతుంటారు. మార్కెట్లో దొరికే పనికిరాని ప్రొడక్టులని కొని వాడుతుంటారు. అయితే పులిపిర్లను తగ్గించడం ఏమోకానీ సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం తప్పవు. అయితే మార్కెట్లో దొరికే ప్రొడక్టులు కాకుండా ఇంటి చిట్కాలా ద్వారా పులిపిర్లకు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు.
1. పసుపు, సున్నం, వంటసోడా ఈ మూడింటిని తీసుకుని…కొంచెం నీరు పోసి బాగా కలపాలి. పేస్టులా మారిన తర్వాత…ఈ పేస్టును టూత్ పిక్ తో పులిపిర్లు ఉన్న ప్రదేశంలో రాయాలి. పావుగంట తర్వాత శుభ్రం చేయాలి. ఈ విధంగా ప్రతిరోజూ చేసినట్లయితే క్రమంగా పులిపిర్లు తగ్గిపోతాయి.
2.రాత్రి పడుకునే ముందు ఆవు నెయ్యిలో చిటికెడు మిరియాల పొడి వేసి బాగా కలపాలి. రాగిపాత్రలో నీరు పోసి అందులో తులసి ఆకులు వేసి రాత్రంతా నానపెట్టాలి.మరుసటి రోజు తులసి ఆకులను నములుతూ నీటిని తాగేయయ్యాలి. ఈ విధంగా చేస్తే శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది.
3. ఎందుకంటే ఇమ్యూనిటీ తగ్గినప్పుడే పులిపిర్లు ఏర్పాడుతుంటాయి. ఈ చిట్కాలను ఫాలో అవుతే తక్కువ సమయంలోనే పులిపిర్లు రాలిపోతాయి. అయితే ఇలా చేసిన తర్వా తకూడా సమస్య తగ్గనట్లయితే డాక్టర్ ను సంప్రదించాలి.
Tags
Related News
Buttermilk: వేసవిలో మజ్జిగతో మీ అందాన్ని రెట్టింపు.. ఎలా అంటే?
పాలు పాల పదార్థాలు అయిన పెరుగు, మజ్జిగ లాంటి వాటి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికి తెలిసిందే. చాలామందికి అన్నం త