Godhuma Pindi Ladoo : గోధుమపిండి లడ్డు తిన్నారా ఎప్పుడైనా? ఇలా తయారుచేసుకోండి టేస్టీగా..
ఇంట్లో సింపుల్ గా స్వీట్ చేయాలనుకున్నప్పుడు గోధుమపిండి లడ్డు చేసుకోండి.
- By News Desk Published Date - 06:00 AM, Fri - 26 April 24

Godhuma Pindi Ladoo : గోధుమపిండితో(Wheat Flour) చపాతీలు, పూరీలు కాకుండా ఇంకా చాలారకాల వంటలు చేసుకోవచ్చు. అందులో లడ్డు కూడా ఒకటి. ఇంట్లో సింపుల్ గా స్వీట్ చేయాలనుకున్నప్పుడు గోధుమపిండి లడ్డు చేసుకోండి. తినడానికి చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది.
గోధుమపిండి లడ్డు తయారీకి కావలసిన పదార్థాలు..
* గోధుమపిండి ఒక కప్పు
* పావు కప్పు ఎండు కొబ్బరి పొడి
* బెల్లం తురుము అర కప్పు
* నెయ్యి రెండు స్పూన్లు
* యాలకుల పొడి పావు స్పూన్
* కాచి చల్లార్చిన పాలు ఒక చిన్న గ్లాస్
* జీడిపప్పు కొద్దిగా
ముందుగా ఒక మూకుడు తీసుకొని దానిలో నెయ్యి వేసి జీడిపప్పు వేయించి పక్కకు పెట్టుకోవాలి. అదే మూకుడులో గోధుమపిండి, ఎండు కొబ్బరి పొడి వేసి వేయించుకోవాలి. దీనిని పచ్చి వాసన పోయేవరకు వేయించుకోవాలి. తరువాత బెల్లం తురుము, యాలకుల పొడి వేసి కలపాలి. ఇది బాగా కలిసిన తరువాత పాలు పోసి కలపాలి. ఈ మిశ్రమం కొంచెం గడ్డ కట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ గోధుమపిండి మిశ్రమ కాసేపు చల్లారిన తరువాత జీడిపప్పులు కూడా ఆ మిశ్రమానికి కలిపి ఒకసారి బాగా కలపాలి. అనంతరం చేతికి నెయ్యి రాసుకొని ఆ గోధుమపిండి మిశ్రమాన్ని లడ్డులుగా చుట్టుకోవాలి. ఈ గోధుమపిండి లడ్డులు మూడు రోజుల వరకు నిలువ ఉంటాయి.
Also Read : Peanut Chikki : షాప్స్ లో అమ్మే పల్లిపట్టి.. ఇంట్లో రుచిగా ఎలా చేయాలంటే..? పల్లిపట్టి ప్రయోజనాలు..