Chocolate Mysore Pak : చాకొలేట్ మైసూర్ పాక్ ఎలా తయారుచేయాలో తెలుసా?
పిల్లలు చాకొలేట్ కోసం మారం చేస్తే అలాంటపుడు మనం ఇంట్లోనే చాకొలేట్ మైసూర్ పాక్(Chocolate Mysore Pak) తయారుచేసి పిల్లలకు ఇస్తే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు.
- By News Desk Published Date - 09:08 PM, Fri - 4 August 23

బయట చాకోలెట్స్(Chocolates) పిల్లలు ఎక్కువగా తింటూ ఉంటారు. అవి ఆరోగ్యానికి మంచిది కాదు. ఎప్పుడో ఒక చాకొలేట్ అయితే పర్లేదు కానీ రెగ్యులర్ గా అంటే కష్టమే. పిల్లలు చాకొలేట్ కోసం మారం చేస్తే అలాంటపుడు మనం ఇంట్లోనే చాకొలేట్ మైసూర్ పాక్(Chocolate Mysore Pak) తయారుచేసి పిల్లలకు ఇస్తే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు.
చాకొలేట్ మైసూర్ పాక్ తయారీకి కావాల్సిన పదార్థాలు..
* శనగపిండి ముప్పావు కప్పు
* కోకోపొడి పావు కప్పు
* బెల్లం కప్పు
* నీళ్లు ముప్పావు కప్పు
* నెయ్యి ముప్పావు కప్పు
* పిస్తా పలుకులు రెండు స్పూన్లు
శనగపిండిని పచ్చి వాసన పోయేంతవరకు వేయించాలి. మంచి సువాసన వచ్చేంతవరకు శనగపిండిని వేయించాలి. మందంగా ఉన్న మూకుడులో బెల్లం నీళ్లు పోసి తీగపాకం వచ్చేంతవరకు మరిగించాలి. శనగపిండి వేగిన తరువాత దానిలో కోకోపొడి, నెయ్యి వేసి ఉండలు లేకుండా కలపాలి. ఈ మిశ్రమం బాగా వేగిన తరువాత దానిలో బెల్లం పాకం వేసి ఉండలు లేకుండా కలబెడుతూ ఉండాలి. తరువాత పిస్తాపలుకులు వేసి ఐదు నిముషాలు ఉంచాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్ లో ఈ మిశ్రమాన్ని వేయాలి. ఒక ఐదు నిముషాల తరువాత మనకు నచ్చిన షేప్స్ లో కట్ చేసి ఉంచుకోవాలి. ఈ విధంగా చాకొలేట్ మైసూర్ పాక్ సింపుల్ గా తయారు చేసుకోవచ్చు.
Also Read : Potatoes For Beauty: బంగాళదుంపతో అందాన్ని రెట్టింపు చేసుకోండిలా?