Glow Skin: ఒక్కరోజులోనే మెరిసిపోయే గ్లోయింగ్ స్కిన్ కావాలంటే ఏం చేయాలో మీకు తెలుసా?
Glow Skin: ఒక్కరోజులోనే మెరిసిపోయే అందం మీ సొంతం కావాలి అంటే అందుకు ఏం చేయాలో, ఎలాంటి చిట్కాలు పాటిస్తే మెడిసిన్ బ్లోయింగ్ స్కిన్ సొంతం అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 07:00 AM, Mon - 13 October 25

Glow Skin: అమ్మాయిలు అబ్బాయిలు ప్రతి ఒక్కరూ కూడా మెరిసే అందమైన చర్మం కావాలి అని కోరుకుంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో అమ్మాయిలతో పాటుగా అబ్బాయిలు కూడా రకరకాల పేస్ క్రీములు ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం మార్కెట్లో దొరికే ఖరీదైన ప్రొడక్ట్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు అవి బాగా పనిచేసిన, మరి కొన్నిసార్లు వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇంట్లోనే ఉండే కొన్నింటిని ఉపయోగించి మెరిసే గ్లోయింగ్ చర్మాన్ని సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు. ఇంతకీ ఆ చిట్కాలు ఏవో ఇపుడు మనం తెలుసుకుందాం..
అయితే ముందుగా శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, పెరుగు తగినంత, పసుపు చిటికెడు తీసుకోవాలి. 2 టీస్పూన్ల శనగపిండిని తగినంత పెరుగు, చిటికెడు పసుపుతో కలపాలి. వీటిని బాగా కలిపిన తర్వాత ముఖానికి 15 నుంచి 20 నిమిషాలు అప్లై చేయాలి. తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మీ ముఖం తక్షణమే తాజాగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. మరొక రెమిడి విషయానికి వస్తే.. 2 టీస్పూన్ల ముల్తానీ మిట్టి, 2 టీస్పూన్ల రోజ్ వాటర్ తీసుకొని పేస్ట్ లాగా కలపి ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి 10 నుంచి 15 నిమిషాలు అప్లై చేసి తర్వాత శుభ్రం చేసుకోవాలట. దీనిని వాడటం వల్ల చర్మం మృదువుగా, మెరిసేలా కనిపిస్తుందట. అంతే కాకుండా ఇది గ్లోయింగ్ స్కిన్ కోసం కూడా అద్భుతంగా పని చేస్తుందట.
ముల్తానీ మట్టి మీ చర్మానికి చాలా ప్రయోజనకరమైన సహజ సమ్మేళనాలను కలిగి ఉంటుందట. దీంతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ మీ చర్మాన్ని చల్లబరుస్తుందని, అంతే కాకుండా రిఫ్రెష్ గా కూడా చేస్తుందని చెబుతున్నారు. అలాగే కలబంద జెల్ ను, నిమ్మరసంతో కూడా మెరిసే చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. దీన్ని మీ ముఖానికి బాగా అప్లై చేసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది మీ చర్మానికి తక్షణ మెరుపు, తాజా రూపాన్ని ఇస్తుందట. కలబంద చర్మాన్ని హైడ్రేట్ గా చేస్తుందని, ఈ ఫేస్ ప్యాక్ లో వాడే నిమ్మరసం మచ్చలను తగ్గిస్తుందని, ఈ ఫేస్ తరచుగా వాడటం వల్ల ముఖం చాలా అందంగా కనిపిస్తుందని చెబుతున్నారు.