HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >How To Get A Credit Card For The First Time What Do You Want

Credit Card: మొదటిసారి క్రెడిట్‌ కార్డు పొందడం ఎలా?

ముఖ్యంగా మొదటిసారి అనుకూలమైన నిబంధనలు, షరతులతో మంచి క్రెడిట్‌ పరిమితితో, మెరుగైన కార్డును పొందడం కొంచెం కష్టమే.

  • Author : Maheswara Rao Nadella Date : 03-12-2022 - 10:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Credit Card

ముఖ్యంగా మొదటిసారి అనుకూలమైన నిబంధనలు, షరతులతో మంచి క్రెడిట్‌ పరిమితితో, మెరుగైన కార్డును పొందడం కొంచెం కష్టమే. కార్డు జారీకి అధిక క్రెడిట్‌ స్కోరు అవసరం. మునుపటి క్రెడిట్‌ చరిత్ర లేకుండా మంచి క్రెడిట్‌ స్కోరు ఉండదు. అందుచేత ముందుగా తక్కువ మొత్తంలో ఛార్జీలు ఉండే, తక్కువ ప్రయోజనాలు లభించే కార్డును తీసుకోవడం ఉత్తమం. ఈ కార్డును ఉపయోగిస్తూ గడువు తేదీలోపు బకాయిలు తీరుస్తుంటే ఆటోమేటిక్‌గా క్రెడిట్‌ స్కోరు పెరుగుతుంది. ఈ క్రెడిట్‌ స్కోరుతో మార్కెట్లో అందుబాటులో ఉండే మెరుగైన కార్డును పొందొచ్చు.

మెరుగైన క్రెడిట్‌ స్కోరుతో ప్రయోజనాలు:

ఒకసారి క్రెడిట్‌ కార్డు పొందిన తర్వాత గడువు తేదీలోపు చెల్లింపులు ఉంటే.. క్రెడిట్‌ స్కోరు బాగా మెరుగవుతుంది. దీంతో అదనపు సౌకర్యాలు, ప్రయోజనాలు కలిగిన వేరే క్రెడిట్ కార్డులను కూడా పొందొచ్చు. ఆ తర్వాత యాడ్‌-ఆన్‌ కార్డులను కూడా పొందొచ్చు. వ్యక్తిగత రుణాలు లభిస్తాయి. ముఖ్యంగా అతిపెద్ద రుణమైన గృహ రుణాన్ని తక్కువ వడ్డీ రేటుకే పొందవచ్చు.

దరఖాస్తు ఎలా చేయాలి?

మీరు కార్డును పొందాలనుకునే బ్యాంకు సమీప బ్రాంచ్‌ను సందర్శించి క్రెడిట్‌ కార్డు ప్రతినిధిని కలిసి మీ ఆదాయం, అవసరాల వివరాలు తెలపండి. బ్యాంకు ప్రతినిధి వివిధ క్రెడిట్‌ కార్డుల సమాచారం మీకు చెబుతారు. మొదటిసారి కార్డును కావాలనుకునేవారు అందులో తక్కువ వార్షిక ఫీజు (లేదా ఫీజు లేని) గల కార్డును ఎంపిక చేసుకోవడం మంచిది. అవసరమైన పత్రాలు (ముఖ్యంగా బ్యాంకు స్టేట్‌మెంట్‌, పాన్‌)లతో పాటు కార్డు దరఖాస్తు ఫారంను పూర్తిచేసి వారికి సమర్పించండి. దరఖాస్తు, ఇతర పత్రాలతో బ్యాంకు సంతృప్తి చెందితే, కార్డు మంజూరవుతుంది. ఇంకా సులభంగా కార్డును పొందడానికి, మీరు బ్యాంకు వెబ్‌సైట్‌ను సందర్శించి, ఆఫర్‌లో ఉన్న వివిధ క్రెడిట్‌ కార్డ్‌ల ఫీచర్‌లను ఛార్జీలతో పోల్చి, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలు

వయసు: ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ దరఖాస్తు ప్రాసెస్‌ కోసం అవసరమైన పత్రాలు, అర్హతలు ఒకే విధంగా ఉంటాయి. క్రెడిట్‌ కార్డుకు అర్హత పొందడానికి దరఖాస్తుదారు వయసు కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. చాలా సందర్భాల్లో యాడ్‌-ఆన్‌ కార్డు పొందడానికి కనీసం 15 ఏళ్లు నిండాలి.

నివాసం: భారత పౌరులు కొత్త క్రెడిట్‌ కార్డు పొందడానికి అర్హులు. ప్రవాస భారతీయులు (NRI) నిర్దిష్ట క్రెడిట్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతి ఉంటుంది.

ఆదాయం: దరఖాస్తుదారుడు స్థిరమైన ఆదాయాన్ని కలిగి ఉండాలి. అది జీతం లేదా వృత్తిపరమైన ఆదాయం కావచ్చు. క్రెడిట్‌ కార్డు జారీ సంస్థలు కనీసం రూ.2 లక్షల వార్షిక ఆదాయాన్ని ఆశిస్తున్నాయి. కార్డు కేటగిరీని బట్టి ఆదాయాన్ని లెక్కలోకి తీసుకుంటారు. అయితే, ఆదాయన్ని బట్టి కార్డు మంజూరు అనేది క్రెడిట్‌ కార్డు జారీ సంస్థలపై ఆధారపడి ఉంటుంది. క్రెడిట్‌ స్కోరు లేనివారికి, క్రెడిట్‌ కార్డును జారీ చేయడానికి వారి ప్రస్తుత ఆదాయ స్థాయిని పరిగణనలోకి తీసుకుంటారు.

గుర్తింపు రుజువు: పాస్‌పోర్ట్‌, పాన్‌ కార్డు, ఓటర్‌ ఐడీ, ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఏదైనా ఒక పత్రాన్ని గుర్తింపు రుజువుగా సమర్పించొచ్చు.

చిరునామా రుజువు: పాస్‌పోర్ట్‌, ఓటరు ఐడీ, ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, రేషన్‌ కార్డు, ఆస్తి పత్రాలు, లీజు/అద్దె ఒప్పందం, గత 3 నెలల యుటిలిటీ బిల్లులు ఏదో ఒకటి సమర్పించాలి.

ఆదాయ రుజువు: ఆదాయపు పన్ను రిటర్న్స్‌, గత 3 నెలల జీతం స్లిప్‌లు, ఉద్యోగ నియామక పత్రం అవసరం పడతాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • credit
  • Credit Care
  • finance
  • First Time
  • Life Style
  • money

Related News

7 Tips to Curb Insomnia for Stress Management

Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Stress Management: “ఒత్తిడి” అనేది మనం చేసే రోజువారీ కార్యకలాపాలకు శరీరం యొక్క సహజ ప్రతిస్పందన. రోజూ సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. నిద్రలేమి వల్ల కలిగే అలసట మిమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. నిద్రలేమి సమస్యకు గల ప్రధాన కారణాల్లో ముఖ్యమైనది ఫోన్‌కు అడిక్ట్ కావడం. నిద్రపోవడానికి ముందు వరకు ఫోన్‌లో మునిగిపోవడం అనేది మీ నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది.

  • Don't worry about low sperm count... follow these Ayurvedic tips and you'll be at the peak of virility...!!

    Sperm Count In Men: స్పెర్మ్ కౌంట్ తగ్గిందని బాధపడకండి… ఆయుర్వేదంలో ఈ చిట్కాలు పాటిస్తే మీరే మగమహారాజు…!!

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd