Curd: వర్షాకాలంలో పెరుగు ఎక్కువగా తింటున్నారా.. అయితే మీరు ఆ సమస్యలకు వెల్కమ్ చెప్పినట్లే!
Curd: వర్షాకాలంలో పెరుగు ఎక్కువగా తీసుకునే వారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని లేదంటే లేనిపోని సమస్యలు వచ్చి అవకాశం ఉంటుంది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 07:00 AM, Sun - 26 October 25
Curd: మనలో చాలామందికీ పెరుగు లేనిదే ముద్ద కూడా దిగదు. రోజులో మూడు సార్లు అన్నం తింటే ఒక్కసారి అయినా పెరుగు తినాల్సిందే. ఎన్ని రకాల కూరలు ఉన్నా కూడా చివరలో కొద్దిగా అయినా పెరుగు అన్నం ఉండాల్సిందే. లేదా మజ్జిగ అయినా తాగి పడుకుంటారు. అయితే పెరుగు ఆరోగ్యానికీ మంచిదే అయినప్పటికీ వర్షాకాలంలో పెరుగు అస్సలు తినకూడదని చెబుతున్నారు. మరి వర్షాకాలంలో పెరుగు ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పెరుగులో ప్రోబయోటిక్స్, పోషకాలు అంటే కాల్షియం, ప్రోటీన్, బి విటమిన్స్ వంటివి పుష్కలంగా ఉంటాయి.
ఇవి జీర్ణ ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. దీంతో పాటు ఎముకలు కూడా బలంగా మారతాయి. ఇమ్యూనీటీ పెరగడమే కాకుండా బరువు తగ్గించడంలో హెల్ప్ అవుతుందట. దీనిని తరచుగా తింటే ఆరోగ్య పరంగానే కాదు, అందానికి కూడా చాలా మంచిదని చెబుతున్నారు. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. దీని వల్ల స్కిన్ నేచురల్ గానే ఎక్స్‌ఫోలియేట్ అవుతుందట. పెరుగులోని గుణాలు చలువ చేస్తాయి. వర్షాకాలంలో పెరుగు తింటే బాడీలో శ్లేష్మం పెరుగుతుందట. దీని వల్ల మనది మనకే ఒక రకమైన హెవీనెస్ ఉంటుందని, దగ్గు వంటి సమస్యలు కూడా వస్తాయని అంతేకాదు ఎండాకాలంలో పెరుగు తింటే ఎంత మంచిదో వర్షాకాలంలో అన్ని నెగెటీవ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయని చెబుతున్నారు.
చర్మ ఆరోగ్యం దెబ్బతినేలా చేస్తుంది. మొటిమ్మలు, దద్దర్లు వంటి చర్మ సమస్యలకి కారణమవుతుందట. తేమ ఎక్కువగా ఉన్నప్పుడు పెరుగు తింటే కీళ్ళు మరింత గట్టిగా మారి కీళ్ళ నొప్పులు పెరుగుతాయట. కాబట్టి వర్షాకాలంలో పెరుగుని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదని చెబుతున్నారు. చల్లని వాతావరణంలో పెరుగుతు తింటే జీర్ణవ్యవస్థలోని అగ్ని బలహీనంగా మారుతుందట. దీంతో జీర్ణ సమస్యలు తలెత్తుతాయని,బ్లోటింగ్, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయని, అందుకే, ఎప్పుడైనా సరే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు పెరుగు తినకూడదని చెబుతున్నారు. జీర్ణ సమస్యలు వస్తే మిగతా ప్రాబ్లమ్స్ ఆటోమేటిగ్గా వస్తాయట. కాగా చల్లని వాతావరణంలో పెరగు తింటే బాడీలో మ్యూకస్ పెరుగుతుంది. దీంతో ప్రమాదకరమైన శ్వాసకోశ సమస్యలు వస్తాయట. దీంతో పాటు జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు వస్తాయట. దీనికి కారణం పెరిగిన తేమ. దీని వల్ల అలర్జీలు పెరిగి సమస్యలు వస్తాయని, కాబట్టి పెరుగుని ఎంత వీలైతే అంతలా అవాయిడ్ చేయడం మంచిది అని చెబుతున్నారు.