Chia Seeds: ఎండలకి ముఖం నల్లగా మారుతోందా.. అయితే చియాసీడ్స్ తో పాటు కొన్ని పదార్థాలు పేస్ ప్యాక్స్ ట్రై చేయాల్సిందే!
వేసవికాలంలో ఎండలకు బాగా తిరిగి ముఖం నల్లగా మారుతూ ఉంటే ఇప్పుడు చెప్పినట్టుగా చీయా సీడ్స్ తో కొన్ని రకాల ఫేస్ ప్యాక్ లు ట్రై చేస్తే ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 11:00 AM, Mon - 7 April 25

మామూలుగా వేసవి కాలంలో చర్మం నల్లబడకుండా ఉండడం కోసం, అలాగే చర్మం కమిలి పోకుండా ఉండడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇకపోతే ఫేస్ మాస్క్ లు ముఖంపై ఉండే చాలా రకాల సమస్యల్ని దూరం చేయడంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా వేసవికాలంలో వచ్చే చర్మ సమస్యలకు చియా సీడ్స్ ఎంతో బాగా ఉపయోగపడతాయట. చియా సీడ్స్‌లో ప్రోటీన్, ఫైబర్, మినరల్స్, విటమిన్స్, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. వీటి వల్ల యాక్నే, ఇన్‌ఫ్లమేషన్ వంటి సమస్యల నుంచి స్కిన్ ని కాపాడుకోవచ్చట. ఈ ఫేస్ మాస్క్ కాంబినేషన్ కూడా స్కిన్ టెక్చర్ ని పెంచుతుందట. దీనికోసం సగం చెక్క నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల చియా సీడ్స్, అర టేబుల్ స్పూన్ బాదం నూనె వేసి బాగా నానబెట్టి, దీనిని రాత్రుళ్లు అప్లై చేసి రాత్రంతా అలానే ఉంచి ఉదయాన్నే నీటితో క్లీన్ చేయాలట. అదే విధంగా ముఖం ఎర్రబడడం వంటి సమస్యల్ని తగ్గించేందుకు 2 టేబుల్ స్పూన్ల చియాసీడ్స్ ని కొన్ని పాలు, 2 ముక్కల బీట్‌రూట్ వేసి బ్లెండ్ చేసి, పేస్టులా అయ్యాక ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోవాలని చెబుతున్నారు.
అలాగే చియా సీడ్స్ ని టమోటా జ్యూస్ విటమిన్ ఈ ఆయిల్ తో కలిపి ముఖానికి అప్లై చేయడం వల్ల మెరిసే చర్మం మీ సొంతం అవుతుందని చెబుతున్నారు. ముఖానికి అప్లై చేసిన తర్వాత 30 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలట. చియాసీడ్స్, తేనె, ఆలివ్ ఆయిల్ మూడింటి కాంబినేషన్ మొటిమలు, మొటిమల మచ్చలకి చాలా బాగా హెల్ప్ చేస్తాయట. వీటిని వాడడం వల్ల స్కిన్ మాయిశ్చర్ గా అందంగా మారుతుందట.. దీనికోసం 1 టీ స్పూన్ తేనె, 2 టేబుల్ స్పూన్ల చియాసీడ్స్, 1 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ మూడింటిని బాగా మిక్స్ చేయాలట. వీటిని ముఖానికి రబ్ చేయాలి. 15 నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లని నీటితో క్లీన్ చేసుకోవాలి అని చెబుతున్నారు.
చియాసీడ్స్, కొబ్బరినూనె, నిమ్మరసం మూడు కూడా స్కిన్ ని సాఫ్ట్ అండ్ హెల్దీగా చేయడంలో హెల్ప్ చేస్తాయట. డెడ్ స్కిన్ ని దూరం చేసి స్కిన్ ని కాపాడుతుందట. అయితే దీనికోసం 2 టేబుల్ స్పూన్ల చియా సీడ్స్ ని ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, అరకప్పు కొబ్బరి నూనె తో కలపాలి. 15 నిమిషాల తర్వాత దీనిని క్లీన్ చేసుకున్న ముఖానికి రాసి అరగంట పాటు ఉంచి ఆ తర్వాత క్లీన్ చేసుకోవాలట. నిమ్మరసం కేవలం కొబ్బరినూనెతో కూడా కలిపి వాడవచ్చట. దీనికోసం 2 టేబుల్ స్పూన్ల కొబ్బరినూనెలో ఒక స్పూన్ నానబెట్టిన చియాసీడ్స్ ని కలిపి, ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల పాటు ఉంచి తర్వాత క్లీన్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.