Glowing skin: చలికాలంలో మెరిసే చర్మం కావాలా.. అయితే ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే!
శీతాకాలంలో చర్మం పొడిబారి అందవిహీనంగా కనిపిస్తుంది. ఈ సమస్యను అదిగమించేందుకు ఇంట్లోని వస్తువులను ఉపయోగించవచ్చని చెబుతున్నారు.
- By Anshu Published Date - 05:36 PM, Sun - 15 December 24

చలికాలం మొదలైంది అంటే చాలు చర్మానికి సంబంధించి అనేక రకాల సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా చర్మం పగలడం పొడిబారడం వంటి సమస్యలు తీవ్ర ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీంతో ఈ సమస్యల నుంచి బయటపడడం కోసం చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల ఫేస్ క్రీములు మాయిశ్చరైజర్లు ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకొందరు పార్లర్ లకు వెళ్లి వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉంటారు. శీతాకాలంలో చర్మం పొడిబారి అందవిహీనంగా కనిపిస్తుంది. ఈ సమస్యను అదిగమించేందుకు ఇంట్లోని వస్తువులను ఉపయోగించవచ్చని చెబుతున్నారు.
మరి అందుకోసం ఏం చేయాలి? ఎలాంటి చిట్కాలు పాటించాలి అన్న విషయానికి వస్తే.. చలికాలంలో చర్మం బిగుతుగా మారడంతో పాటూ పొడిబారుతుంది. చల్ల గాలి కారణంగా చర్మాన్ని రక్షించే నూనె తొలగిపోయి అనేక సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి శీతాకాలంలో చర్మాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందుకోసం చర్మం హైడ్రేడ్ గా ఉండడానికి తరచూ నీరు తాగుతుండాలి. అలాగే బయటికి వెళ్లే సమయంలో సన్‌స్ర్కీన్ లోషన్ ను కూడా వాడాలి. కాగా సహజసిద్ధమైన ఫేసియల్ కోసం ఒక గిన్నెలో రెండు చెంచాల ఓట్స్ పౌడర్, 3 చెంచాల పాలు, ఒక చెంచా గ్లిజరిన్ తీసుకోవాలి. తర్వాత వాటిని బాగా కలిపి ముఖానికి రాసుకోవాలి.
సుమారు 5 నిముషాల సేపు అలాగే ఉంచి, తర్వాత శుభ్రంగా కడిగేయాలి. ఇలా చేస్తే పొడిబారిన చర్మ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే ముఖంపై మసాజ్ చేయడం కోసం రెండు చెంచాల పెరుగు, రెండు చెంచాల బీట్రూట్ రసం తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పది నిమిషాల పాటు మసాజ్ చేసిన తర్వాత నీటితో శుభ్రంగా కడిగేయడం వల్ల చర్మం మృదువుగా మారడంతో పాటు కాంతివంతంగా తయారవుతుంది. అలాగే సహజ సిద్ధమైన ఫేస్ ప్యాక్ కోసం ముల్తానీ మట్టి, శనగ పిండి, బంగాళా దుంప రసం తీసుకోవాలి. అందులో అర చెంచా గ్లిజరిన్, కొన్ని పాలు వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 10 నిముషాలు అలాగే ఉంచి శుభ్రం చేసుకోవాలి. దీంతో పాటూ చియా గింజలు, బీట్‌రూట్ రసం, పాలను కలిపి కూడా ఫేస్ ప్యాక్ తయారు చేయవచ్చు. ఇలాంటి ఫేస్ ప్యాక్ చేసుకోవడం వల్ల ముఖంపై నల్ల మచ్చలు కూడా తొలగిపోయి మెరుస్తూ ఉంటుంది. పొడి చర్మం ఉన్న వారు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు.