Headache: తలనొప్పి వేధిస్తోందా.. అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే?
Headache: ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్లు, పని ఒత్తిడి, ల్యాప్ టాప్,సిస్టమ్ లు స్క్రీన్ లకు సంబంధించిన పరికరాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల చాలామంది తలనొప్పి సమస్యతో బాధపడుతున్నారు.
- Author : Anshu
Date : 18-10-2022 - 9:30 IST
Published By : Hashtagu Telugu Desk
Headache: ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్లు, పని ఒత్తిడి, ల్యాప్ టాప్,సిస్టమ్ లు స్క్రీన్ లకు సంబంధించిన పరికరాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల చాలామంది తలనొప్పి సమస్యతో బాధపడుతున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ సమస్య సర్వసాధారణమైపోయింది. అయితే తలనొప్పిని తగ్గించుకోవడం కోసం ప్రతిసారి కూడా టాబ్లెట్లు వాడటం అంత మంచిది కాదు అంటున్నారని నిపుణులు. కొన్ని చిట్కాలు ద్వారా కూడా తలనొప్పిని తగ్గించుకోవచ్చట. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. హెడ్ మసాజ్ ద్వారా తలనొప్పిని తొందరగా తగ్గించుకోవచ్చు.
మసాజ్ వల్ల వెంటనే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఐస్ ప్యాక్ ద్వారా కూడా తలనొప్పిని ఈజీగా తగ్గించుకోవచ్చు. ఇందుకోసం ఐస్ ప్యాక్ ను కర్చీఫ్ లేదా టవల్ తో చుట్టి నొప్పి ఉన్న కొద్దిసేపు పెడితే తక్షణ ఉపశమనం పొందవచ్చు. అరోమాథెరపీ కూడా మీ తలనొప్పిని తగ్గించడంలో ఎంతో బాగా పనిచేస్తుంది. అలాగే మీకు విశ్రాంతిని ఇచ్చేందుకు సహాయపడే ఎటువంటి సువాసనను ఉపయోగించినా కూడా తలనొప్పి ఈజీగా తగ్గుతుంది. కొన్ని కొన్ని సార్లు డీహైడ్రేషన్ కారణంగా కూడా తలనొప్పిస్తూ ఉంటుంది.
ఇంటప్పుడూ నీళ్లను ఎక్కువగా తాగడం మంచిది. అలాగే కొబ్బరినీళ్ళతో పాటు ఇతర ఎలక్ట్రోలైట్ కలిగిన పానీయాలు తాగడం ఇంకా మంచిది. అలాగే తలనొప్పి వచ్చినప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుని నెమ్మదిగ
గా వదులుతూ ఉండాలి. ఈ విధంగా చేయడం వల్ల తలనొప్పికి కారణం అయ్యే ఒత్తిడి, ఆందోళనలను తగ్గించడానికి సహాయపడుతుంది. కంటినిండా సరిగా నిద్రలేకపోవడం వల్ల కూడా తీవ్రమైన తలనొప్పి కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఆర్ నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోయే విధంగా ప్లాన్ చేసుకోవాలి. సరిగ్గా నిద్ర లేకపోతే తల నొప్పితో పాటు ఎన్నో ఆరోగ్య సమస్యలు తలేత్తుతాయి.