Alovera: జుట్టు తొందరగా పెరగాలి అంటే కలబందను ఇలా ఉపయోగించాల్సిందే!
కలబందతో కొన్ని రకాల సింపుల్ టిప్స్ ఫాలో అవ్వడం వల్ల జుట్టుకు సంబంధించిన సమస్యలు తగ్గి జుట్టు బాగా పెరుగుతుందని చెబుతున్నారు.
- By Anshu Published Date - 02:30 PM, Fri - 20 December 24

కలబంద వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. పూర్వం నుంచి ఆయుర్వేదంలో ఎన్నో రకాల ఔషధాల తయారి కోసం కలబందను ఉపయోగిస్తూనే ఉన్నారు. కలబంద వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కలబంద కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మార్కెట్లో కూడా కలబందతో తయారుచేసిన చాలా రకాల ఫేస్ క్రీములు సోకులు వంటివి అందుబాటులో ఉన్నాయి. కేవలం చర్మ సౌందర్యానికి మాత్రమే కాకుండా జుట్టుకు సంబంధించిన సమస్యలకు కూడా కలబంద ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
చుండ్రు సమస్యలకు జుట్టు పెరగడానికి కలబంద ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మరి కలబంద ఇంకా ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కలబంద జుట్టును బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇందులో ఫ్యాటీ యాసిడ్స్, అమైనో యాసిడ్స్ కూడా ఉంటాయి. కలబందలో యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ జుట్టుకు చాలా చాలా మంచిది. కలబంద అద్భుతమైన నేచురల్ కండీషనర్ గా కూడా పని చేస్తుంది. ఇది నెత్తిని హైడ్రేట్ చేయడానికి, నేచురల్ ఆయిల్ ను ఉత్పత్తి చేస్తుంది. కలబందలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ లు పుష్కలంగా ఉంటాయి.
ఈ మూడు విటమిన్లు కణాల పెరుగుదలకు, ఆరోగ్యకరమైన కణాల పెరుగుదలకు, మెరిసే జుట్టుకు బాగా ఉపయోగపడతాయి. కలబంద జెల్ లో విటమిన్ బి 12, ఫోలిక్ యాసిడ్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు కారకాలు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. జుట్టు పెరిగేందుకు సహాయపడతాయి. అయితే ఇందుకోసం
ఒక టీ స్పూన్ అలోవెరా జెల్ లో తులసి ఆకుల రసం, పుదీనా ఆకుల రసాన్ని మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ ప్యాక్ ను వారానికి రెండు లేదా మూడు సార్లు అప్లై వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల జుట్టు స్ట్రాంగ్ గా తయారవ్వడంతో పాటు పొడుగ్గా కూడా పెరుగుతుందట. అలాగే కలబంద జెల్, పెరుగు, నిమ్మరసాన్ని మిక్స్ చేసి తలకు అప్లై చేయడం వల్ల చుండ్రు తొలగిపోతుందట. అలాగే తలపై ఉండే చిన్న చిన్న గడ్డలను తొలగించడానికి కూడా ఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది. అలోవెరా జెల్ ను వేసవిలో నెత్తిమీద చల్లబరచడానికి కూడా ఉపయోగించవచ్చని చెబుతున్నారు.