Gutti Kakarakaya: గుత్తి కాకరకాయ వేపుడు ఇలా చేస్తే చాలు ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే?
- Author : Sailaja Reddy
Date : 04-03-2024 - 11:00 IST
Published By : Hashtagu Telugu Desk
మామూలుగా చాలా మంది కాకరకాయతో చేసిన ఆహార పదార్థాలను తినడానికి అసలు ఇష్టపడరు. ఎందుకంటే కాకరకాయ చేదుగా ఉంటుంది. కొందరు కాకరకాయను తెగ ఇష్టంగా తింటూ ఉంటారు. మామూలుగా కాకరకాయతో వేపుడు మసాలా కర్రీ లాంటివి ఎక్కువగా చేసుకొని తింటూ ఉంటాం. అయితే ఎప్పుడైనా కూడా గుత్తి కాకరకాయ అవి ఎప్పుడు తిన్నారా. ఒకవేళ తినకపోతే ఈ రెసిపీ తినకపోతే ఈ రెసిపీ ని ఎలా తయారు చేసుకోవాలి. అందుకు ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు:
కాకరకాయలు – పావుకిలో
నూనె – తగినంత
ధనియాలు – ఒక స్పూను
జీలకర్ర – ఒక స్పూను
ఎండు కొబ్బరి – చిన్న ముక్క
కారం – ఒకటిన్నర స్పూను
పసుపు – పావు స్పూను
వెల్లుల్లి రెబ్బలు – పది
ఉప్పు – రుచికి సరిపడా
తయారీ విధానం :
కాకర కాయలను నిలువుగా కోసుకుని గుత్తి వంకాయలు గాటు పెట్టినట్టే మధ్యలో గాటు పెట్టాలి. కాకరకాయ పొట్టలో ఉన్న గింజలన్నీ తీసి వేయాలి. కాకరకాయల పొట్టలో ఉప్పును రుద్ది అలా పదినిమిషాలు ఉంచాలి. తరువాత వచ్చి కాయలను చేతులతో పిండితే నీరు బయటికి పోతుంది. ఆ నీటితో పాటూ చేదు కూడా బయటికి పోతుంది. ఇప్పుడు కడాయిలో నూనె వేసి అందులో కాకరకాయలను వేయించి, తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీలో ధనియాలు, కారం, ఎండుకొబ్బరి, పసుపు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి రుబ్బుకోవాలి. నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. ఆ మసాలాను కాకరకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. స్టవ్ పై కళాయి పెట్టి రెండు చెంచాల నూనె వేసి, స్టఫ్ చేసిన కాకర కాయలను వేయించాలి. చిన్న మంట మీద వేయిస్తే పావుగంటలో చక్కగా వేగుతాయి.