HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Green Tea Vs Moringa Tea For Weight Loss

‎Weight Loss: గ్రీన్‌ టీ, మునగాకు టీ.. బరువు తగ్గాలి అనుకున్న వారికి ఏది మంచిదో తెలుసా?

‎Weight Loss: బరువు తగ్గాలి అనుకున్న వారికి గ్రీన్ టీ అలాగే మునగాకు టీలలో ఏది మంచిది. దేని వల్ల ఎక్కువ ఫలితాలు కలుగుతాయి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 26-09-2025 - 7:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
‎weight Loss
‎weight Loss

‎Weight Loss: అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు బరువు తగ్గడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది డైట్లు ఫాలో అవ్వడం, జిమ్ లో ఎక్సర్సైజులు చేయడం వర్కౌట్ లు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. కొంతమంది ఉపవాసాలు ఉండడంతో పాటు ఒక పూట భోజనం చేయకుండా ఉండటం లాంటి నియమాలను పెట్టుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది మునగాకు టీ మరి కొంతమంది గ్రీన్ టీ కూడా బరువు తగ్గడం కోసం ఉపయోగిస్తూ ఉంటారు. మరి ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో, ఏది ఎక్కువ ఎఫెక్ట్ గా పని చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
‎
‎కాగా గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంలో కొవ్వు ఆక్సీకరణ పెరుగుతుందట. తద్వారా కొవ్వు వేగంగా కరుగుతుందని చెబుతున్నారు. రోజూ గ్రీన్‌ టీ తాగడం వల్ల మన జీవక్రియ కూడా వేగవంతం అవుతుందట. ఇకపోతే మోరింగ టీని మోరింగ ఆకులు అనగా మునగ ఆకు నుండి తయారు చేస్తారు. మునగాకు టీలో ఐరన్, కాల్షియం, పొటాషియం, విటమిన్లు ఎ, సి, ఇ పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరానికి పోషణను అందిస్తుంది. గ్రీన్ టీలో పోషకాలు తక్కువగా ఉంటాయి. కేవలం యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కానీ మునగాకు టీలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది.
‎
‎తరచుగా చిరుతిళ్లు, అతిగా తినడం నివారించడానికి కూడా సహాయపడుతుందని చెబుతున్నారు. అలాగే ఈ టీలో క్లోరోజెనిక్ ఆమ్లం ఉంటుంది. ఇది శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుందట. తద్వారా శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటుందట. పేగులను శుభ్రంగా ఉంచడంలో, ఇన్ ఫ్లమేషన్ ను తగ్గించడంలో మునగాకు టీ చాలా బాగా పని చేస్తుందని, ఇది కడుపులో ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుందని చెబుతున్నారు. అయితే గ్రీన్ టీ కూడా కడుపుకు మంచిదే అయినప్పటికి ఇది ఖాళీ కడుపుతో తాగడం వల్ల కొంత చికాకు కలిగిస్తుంది. గ్రీన్‌ టీ లో థర్మోజెనిక్ ప్రభావం అంటే వేడిని ఉత్పత్తి చేసే సామర్థ్యం ఫ్యాట్ బర్నింగ్ ను పెంచుతుందట.
‎
‎దీనిలోని కెఫిన్, కాటెచిన్లు కొవ్వును కాల్చడాన్ని వేగవంతం చేస్తాయట. వ్యాయామంతో కలిపితే ఇది కేలరీలను వేగంగా బర్న్ చేయడంలో సహాయపడుతుందట. ఫలితాలు కూడా వేగంగా కనిపిస్తాయట. మోరింగా టీ ప్రభావం కొంచెం నెమ్మదిగా ఉంటుందని చెబుతున్నారు. వేగంగా బరువు తగ్గాలనుకుంటే, కెఫిన్ తో సమస్యలు లేకపోతే, గ్రీన్ టీ ప్రభావవంతంగా ఉంటుంది. సహజమైన, పోషకాలు అధికంగా ఉండే, కెఫిన్ లేని టీ కావాలనుకుంటే మునగాకు టీ మంచిది. మునగ టీ తాగడం వల్ల బరువు నెమ్మదిగా క్రమంగా తగ్గవచ్చు. కానీ, గ్రీన్ టీ తాగడం వల్ల వేగంగా బరువు తగ్గడం కనిపిస్తుంది. అందువల్ల బరువు తగ్గడానికి గ్రీన్ టీ ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • green tea
  • health tips
  • moringa tea
  • weight loss

Related News

Are you troubled by nerve weakness

Nerve Health: నరాల బలహీనత వేధిస్తోందా?

మన శరీరానికి నరాలు ఎంతో ముఖ్యమైనవి. అవి బలహీనపడితే అడుగు తీసి అడుగు వేయడం కూడా కష్టంగా మారుతుంది. నేటి ఆధునిక కాలంలో పోషకాహారం తీసుకోకపోవడం, సరైన వ్యాయామం లేకపోవడం వల్ల నరాల పటుత్వం తగ్గి చిన్న వయసులోనే నీరసం, తిమ్మిర్లు వంటి సమస్యల బారిన పడుతున్నారు. అయితే వీటికి ఖరీదైన చికిత్సల కంటే మన వంటింట్లో ఉండే వాము, లవంగాలు, దాల్చినచెక్క అద్భుతమైన పరిష్కారం చూపుతాయని, నరాల వ్య

  • Diabetes

    Diabetes: ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి? శరీరంలో వచ్చే మార్పులు ఇవే…

  • Weight Loss

    Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

  • Identify Autism This Way!

    Autism: ఆటిజం వ్యాధిని ఇలా గుర్తించండి!

  • Can diabetic patients eat watermelon?

    Watermelon : డయాబెటిక్ పేషెంట్లు పుచ్చకాయ తినవచ్చా?

Latest News

  • Vaastu Tips: పిచ్చుకలు ఇంట్లో గూడు కట్టాయా? అయితే వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి..!!

  • YSRCP: దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేతకు బిగుస్తున్న ఉచ్చు…..!!

  • Ghar Soap Ad Controversy: అలీ ఘర్ సబ్బు యాడ్‌ వివాదం

  • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

  • Nara Lokesh: ‘మేడ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’.. మంత్రి నారా లోకేష్ ట్వీట్

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd