HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Green Mango Prevents The Chances Of Cancer And Some Other Health Issues

Green Mango : ప్రాణాంతక వ్యాధిని దూరంచేసే పచ్చిమామిడి.. ఇంకా ఆరోగ్య ప్రయోజనాలెన్నో

పచ్చిమామిడి కాయలతో తయారు చేసిన పానీయాన్ని వేసవికాలంలో తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఎండలో వడదెబ్బ(Sun Stroke) తగలకుండా పచ్చిమామిడిలో ఉండే విటమిన్ సి(Vitamin C) రక్షిస్తుంది.

  • Author : News Desk Date : 17-04-2023 - 6:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mango
Mango

వేసవి(Summer) వచ్చిందంటే అందరికీ గుర్తొచ్చేది మామిడి కాయలు. వేసవి ప్రత్యేకం మామిడి పండ్లు(Mangos). ఈ వేసవిలో వచ్చే పచ్చి మామిడిపండ్లు వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ఒక ఔషధంలా పనిచేస్తాయి. పచ్చిమామిడి కాయలతో తయారు చేసిన పానీయాన్ని వేసవికాలంలో తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఎండలో వడదెబ్బ(Sun Stroke) తగలకుండా పచ్చిమామిడిలో ఉండే విటమిన్ సి(Vitamin C) రక్షిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి సీజనల్ వ్యాధులతో పోరాడేందుకు సహాయపడుతుంది. అలాగే ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి జీవక్రియను ప్రోత్సహించి బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.

వేసవిలో పచ్చిమామిడి తినడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి. ఇతర పండ్లతో పోలిస్తే పచ్చిమామిడిలో సహజ చక్కెర స్థాయి తక్కువగా ఉంటుంది. షుగర్ పేషంట్స్ కు పచ్చిమామిడి ఔషధంలా పనిచేస్తుందనడంలో సందేహం లేదు. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.

అలాగే.. పచ్చిమామిడి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఒక కప్పు పచ్చి మామిడి రసం మొత్తం రోజువారీ విటమిన్ ఎ లో 10 శాతం అందిస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులో విటమిన్ సి కూడా పుష్కలంగా లభిస్తుంది. పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో, రక్తప్రవాహాన్నిసక్రమంగా నిర్వహించడంలో సహాయపడుతాయి.

పచ్చిమామిడిలో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటు(బీపీ) సమస్యను కూడా తగ్గిస్తాయి. ఇందులో ఉండే మాంగిఫెరిన్ సూపర్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. పచ్చి మామిడిపండ్లు రక్తంలో ఉండే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ స్థాయిని తగ్గించడంలో కూడా సహాయపడతాయి. వీటితో పాటు పచ్చిమామిడిలో ఉండే పాలీ ఫెనాల్స్ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులతో పోరాడుతుంది. యాంటీ కార్సినోజెనిక్ ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా పనిచేస్తాయి. నిపుణులు చెప్పిన దానిప్రకారం.. పచ్చిమామిడిలో లభించే పాలీఫెనాల్స్ .. లుకేమియా, పెద్దప్రేగు, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్ వంటి వివిధ క్యాన్సర్ కణాలు పుట్టకుండా నిరోధిస్తాయి. అందుకే వేసవిలో కచ్చితంగా మామిడి కాయలని ఏదో ఒక రూపంలో ఆహారంగా తీసుకోవాలి.

 

Also Read :   Lemon Juice: ప్రతిరోజు నిమ్మరసం తాగుతున్నారా.. అయితే ఏం జరుగుతుందో తెలుసా?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cancer
  • Green mango
  • health tips
  • Mangos
  • summer

Related News

Are you troubled by nerve weakness

Nerve Health: నరాల బలహీనత వేధిస్తోందా?

మన శరీరానికి నరాలు ఎంతో ముఖ్యమైనవి. అవి బలహీనపడితే అడుగు తీసి అడుగు వేయడం కూడా కష్టంగా మారుతుంది. నేటి ఆధునిక కాలంలో పోషకాహారం తీసుకోకపోవడం, సరైన వ్యాయామం లేకపోవడం వల్ల నరాల పటుత్వం తగ్గి చిన్న వయసులోనే నీరసం, తిమ్మిర్లు వంటి సమస్యల బారిన పడుతున్నారు. అయితే వీటికి ఖరీదైన చికిత్సల కంటే మన వంటింట్లో ఉండే వాము, లవంగాలు, దాల్చినచెక్క అద్భుతమైన పరిష్కారం చూపుతాయని, నరాల వ్య

  • Diabetes

    Diabetes: ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి? శరీరంలో వచ్చే మార్పులు ఇవే…

  • Identify Autism This Way!

    Autism: ఆటిజం వ్యాధిని ఇలా గుర్తించండి!

  • 10 Natural Remedies to Stop Hair Fall

    Hair Fall: ఎండాకాలంలో జుట్టు రాలుతోందా?…ఈ సహజ సిద్ధ పదార్థాలతో చెక్ పెట్టండి..!!

  • Can diabetic patients eat watermelon?

    Watermelon : డయాబెటిక్ పేషెంట్లు పుచ్చకాయ తినవచ్చా?

Latest News

  • Vaastu Tips: పిచ్చుకలు ఇంట్లో గూడు కట్టాయా? అయితే వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి..!!

  • YSRCP: దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేతకు బిగుస్తున్న ఉచ్చు…..!!

  • Ghar Soap Ad Controversy: అలీ ఘర్ సబ్బు యాడ్‌ వివాదం

  • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

  • Nara Lokesh: ‘మేడ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’.. మంత్రి నారా లోకేష్ ట్వీట్

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd