Damage Kidney: వామ్మో.. మనం తరచుగా తీసుకునే ఈ ఫుడ్స్ కిడ్నీలను దెబ్బతీస్తాయా.. చాలా డేంజర్!
Damage Kidney: మనం తరచుగా తీసుకునే కొన్ని రకాల ఫుడ్స్ మనకు తెలియకుండానే మనకు కిడ్నీలను దెబ్బతీస్తాయి అని చెబుతున్నారు. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 07:00 AM, Sat - 11 October 25

Damage Kidney: మన శరీరంలో ఉన్న కొన్ని ముఖ్యమైన భాగాలలో కిడ్నీలు కూడా ఒకటి. నిజానికి లివర్ తరవాత అంత కీలకంగా పని చేసే అవయవాల్లో కిడ్నీలు ఒకటి. వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రోజు సరిపడినన్ని నీరు తాగడం వల్ల కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అలాగే కొన్ని రకాల ఆహార పదార్థాలను దూరం పెడితే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయట. మరిఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే కిడ్నీలకు ప్రమాదమో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
నీరు సరిగ్గా తాగడం ఒక్కటే కాదు, అంతకు మించి డైట్ లో మార్పులు చేసుకుంటేనే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి అని చెబుతున్నారు. అందుకే కొన్ని ఆహార పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలట. ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఎందుకంటె వీటిలో సోడియంతో పాటు ఇతరత్రా ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయట. ముఖ్యంగా నైట్రేట్స్ ఉంటాయి. ఇవి కిడ్నీల ఆరోగ్యాన్ని చాలా త్వరగా దెబ్బ తీస్తాయట. శరీరంలో సోడియం పెరిగే కొద్దీ బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది.
ఇది కిడ్నీల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందట. కానీ ఎప్పుడు అయితే సోడియం ఎక్కువవుతుందో అప్పుడు కిడ్నీలపై లోడ్ పెరిగి ఫలితంగా అవి పని చేయకుండా పోతాయట. అలాగే చాలామంది సూప్స్ వంటివి తయారు చేసుకుని తాగుతూ ఉంటారు. ఇవి క్షణాల్లోని రెడీ అవుతాయి అని చాలా సింపుల్గా చేసేసుకుని తింటూ ఉంటారు. అయితే వీటిని తయారు చేయడం సులువే కానీ వీటిని తాగడం వల్ల మాత్రం కిడ్నీలకు సమస్యలు వస్తాయట. అదే సమయంలో నూడుల్స్ కూడా ఇదే స్థాయిలో చెడు చేస్తాయట. ఈ సూప్స్, నూడుల్స్ లో సోడియం అధికంగా ఉంటుంది.
ఫ్లేవర్ కోసం కలిపిన ఆర్టిఫిషియల్ కెమికల్స్ ఉంటాయి. రోజువారి మీరు తీసుకోవాల్సిన సోడియం లెవెల్స్ కన్నా అధికంగా వీటిలో ఉంటాయి. సోడియం పెరిగే కొద్దీ కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా టాక్సిన్స్ సరైన విధంగా ఫిల్టర్ కావు. నీరు కూడా శరీరంలో పెరుగుతుంది. ఫలితంగా ఈ నీరంతా కండరాల్లోకి చేరుకుంటుంది. ఈ కారణంగా పాదాల వాపులు, నొప్పులతో ఇబ్బంది పడాల్సి వస్తుందట. దీని వల్ల బ్లడ్ ప్రెజర్ పెరిగే ప్రమాదం కూడా ఉంటుందని చెబుతున్నారు. అలాగే షుగర్ ఎక్కువగా కలిపిన డ్రింక్స్, సోడాలు లాంటి వాటికీ దూరంగా ఉండాలని చెబుతున్నారు. అలాగే ప్యాకేజ్డ్ చిప్స్ కారణంగా కూడా సోడియం అధికంగా శరీరంలోకి వెళ్తుందట. పైగా వీటిలో ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయట. వీటితో పాటుగా పచ్చళ్లకు కూడా దూరంగా ఉండాలట. ఎందుకంటే ఈ పచ్చళ్లలో కూడా ఎక్కువ మొత్తంలో సోడియం ఉంటుంది. ఇది కిడ్నీలపై ప్రభావాన్ని చూపిస్తుందని చెబుతున్నారు. కాబట్టి మన కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే పైన చెప్పిన ఆహార పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలని చెబుతున్నారు.