Lose Weight: బరువు తగ్గాలి అనుకుంటున్నారా.. అయితే సాయంత్రం ఈ పని చేయాల్సిందే!
Lose Weight: బరువు తగ్గాలి అనుకుంటున్న వారు సాయంత్రం సమయంలో ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే చాలు ఈజీగా బరువు తగ్గడం ఖాయం అని చెబుతున్నారు. మరి బరువు తగ్గడం కోసం ఏమి చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- Author : Anshu
Date : 29-11-2025 - 7:00 IST
Published By : Hashtagu Telugu Desk
Lose Weight: ప్రస్తుత రోజుల్లో బరువు తగ్గడం అన్నది ఒక టాస్క్ గా మారిపోయింది. అయితే బరువు తగ్గడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. డైట్ ఫాలో అవ్వడంతో పాటు రక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే బరువు తగ్గడానికి నడక ఎంతో బాగా ఉపయోగపడుతుంది అన్న విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం బిజీ షెడ్యూల్ కారణంగా ఉదయం లేదా సాయంత్రం సమయంలో నడవడానికి వీలు కుదరడం లేదు. కానీ కొంచెం సేపు టైం తీసుకునే వాకింగ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయట.
ఎందుకంటే ఈవెనింగ్ వాక్ మిమ్మల్ని ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుందని చెబుతున్నారు. కాగా సాయంత్రం వాకింగ్ చేయడం లేదా వ్యాయామం చేయడం శరీర కండరాలకు మంచిదని చెప్తున్నారు. రాత్రి భోజనం తర్వాత నడవడం వల్ల మంచి నిద్ర వస్తుందట. శక్తి స్థాయిలు కూడా మెరుగవుతాయని, మెటబాలీజం పెరుగుతుందని, ఆకలి తగ్గుతుందని, దీనివల్ల బరువు వేగంగా తగ్గుతారని చెబుతున్నారు. సాయంత్రం నడకతో బరువు తగ్గాలనుకుంటే దాని కోసం ఒక నిర్దిష్ట సమయాన్ని కేటాయించుకోవాలట.
అరగంట నడిస్తే తరువాత సమయాన్ని మీకు అనుకూలంగా పెంచుకోవచ్చట. సాయంత్రం నడకకు వెళ్లినప్పుడు ప్రారంభ నిమిషాల్లో వేగాన్ని తగ్గించాలట. తర్వాత వేగాన్ని పెంచాలట. వేగంగా నడవడం వల్ల కొవ్వు త్వరగా కరుగుతుందని, ఈ టెక్నిక్ ఫాలో అవ్వడం వల్ల బరువు తగ్గుతారని చెబుతున్నారు. నడకను తక్కువ సమయంతో ప్రారంభించినా గ్రాడ్యుల్ గా పెంచాలట. అరగంట నుంచి గంట వరకు వాక్ చేయవచ్చట. మొదట్లో కొంచెం కష్టంగా ఉన్నా తరువాత అది అలవాటుగా మారుతుందట. మీరు బరువు వేగంగా తగ్గుతారట. అయితే ముందుగా నడకను బాడీకి అలవాటు చేయాలట. సాయంత్రం నడవడానికి వెళ్లినప్పుడు అలసిపోయినట్లు అనిపిస్తే వెంటనే బ్రేక్స్ తీసుకోవాలట. ఎక్కడైనా కూర్చుని డీప్ బ్రీత్స్ తీసుకొని, ఒకటి లేదా రెండు సిప్స్ నీరు వాటర్ తాగాలట. ఇది అలసటను తగ్గిస్తుందని, ఆరోగ్యానికి మంచిదని, యాక్టివ్ గా వాక్ చేయడంలో హెల్ప్ చేస్తుందని చెబుతున్నారు.