Oil for Hair Loss : జుట్టు ఒత్తుగా పెరగాలంటే కొబ్బరి నూనెలో అది కలిపి రాస్తే చాలు?
ప్రస్తుత రోజుల్లో స్త్రీ పురుషులు చాలామంది జుట్టు ఊడిపోవడం సమస్యతో బాధపడుతున్నారు. మరి ముఖ్యంగా పురుషులు జుట్టు ఊడిపోయి పలచగా అయిపోవడం లేద
- By Anshu Published Date - 10:00 PM, Sun - 25 June 23

ప్రస్తుత రోజుల్లో స్త్రీ పురుషులు చాలామంది జుట్టు ఊడిపోవడం సమస్యతో బాధపడుతున్నారు. మరి ముఖ్యంగా పురుషులు జుట్టు ఊడిపోయి పలచగా అయిపోవడం లేదంటే బట్టతల రావడం లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. చాలామంది స్త్రీలు ఎక్కువ శాతం హెయిర్ ఫాల్ అవ్వడం వల్ల పలుచని జుట్టుతో బాధపడుతున్నారు. హెయిర్ ఫాల్ సమస్యకు చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒత్తిడి, ఆందోళన, విశ్రాంతి లేకపోవడం, కాలుష్యం, పోషకాహార లోపం, ఆరోగ్య సమస్యల కారణం ఇలా ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. చాలా మంది అమ్మాయిలు జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. కొంతమందికి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు పలుచబడి నుదురు కనిపిస్తూ ఉంటుంది.
మరి హెయిర్ ఫాల్ సమస్యను ఎలా అరికట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. హెయిర్ ఫాల్ కోసం కొబ్బరినూనె ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇందులో లారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది జుట్టు షాప్ట్‌లోకి చొచ్చుకుపోయి ప్రోటీన్‌లా పని చేస్తుంది. ఇక కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్, అమైనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుని పెరిగేలా చేస్తాయి. ఈ రెమిడీని ఉపయోగించడానికి పాన్‌లో కొబ్బరినూనెని వేడి చేసి కొన్ని కరివేపాకులు వేసి వేడి చేసి చల్లారనివ్వాలి. ఆ తర్వాత దానిని జుట్టుకి మసాజ్ చేసి ఒక రాత్రంతా అలానే ఉంచి లేదంటే 30 నిమిషాల పాటు ఆగిన తర్వాత షాంపూ తో తలస్నానం చేయాలి.
అలాగే కొబ్బరి నూనెలో బృంగరాజ్ ఆకులు వేసి మరిగించి అది గోరువెచ్చగా అయ్యాక తలకి రాసుకోవాలి. ఇది స్కాల్ప్‌ని బలంగా చేస్తాయి. నిద్రపోయే ముందు తలకి రాయడం వల్ల జుట్టు రాలే సమస్యలు తగ్గుతాయి. ఉల్లిపాయ రసం కూడా జుట్టు పెరిగేలా చేస్తుంది. అంతేకాకుండా కొత్త జుట్టు మొలవడానికి సహాయ పడడంతో పాటు హెయిర్ ఫాల్ సమస్యను అరికడుతుంది. ఇందులో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి జుట్టుని బలంగా చేస్తుంది. ఉల్లి రసాన్ని కొబ్బరి నూనెలో కలిపి అందులోనే మందార, కరివేపాకు ఇతర మూలికలు వేసి ఆయిల్‌ని మరిగించి గోరువెచ్చగా అయ్యాగా తలకి రాసి మసాజ్ చేసి 30 నిమిషాల తర్వాత స్నానము చేస్తే సరిపోతుంది. అలాగే ఉసిరి పొడిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దీనిని రాయడం వల్ల జుట్టు పెరుగుతుంది. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కొల్లాజెన్‌ని ఉత్పత్తి చేసి జుట్టు పెరిగేలా చేస్తుంది. అందుకోసం ఉసిరి ప్యాక్ వేసుకోవచ్చు. ఉసిరిపొడిని నీటితో కలిపి జుట్టుకి ప్యాక్ వేసుకోవాలి. దీని వల్ల జుట్టు రాలడం తగ్గి బాగా పెరుగుతుంది.