Turmeric Pepper Drink: ఖాళీ కడుపుతో ఈ మ్యాజిక్ డ్రింక్ తాగితే చాలు.. హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే లేదు?
Turmeric Pepper Drink: ఖాళీ కడుపుతో ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ తాగితే చాలు కలిగే ఫలితాలు అస్సలు నమ్మలేరు అని చెబుతున్నారు. మరి ఇంతకీ ఆ జ్యూస్ ఏంటి?దాని వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 06:45 PM, Sun - 16 November 25
Turmeric Pepper Drink: పసుపు, మిరియాలు కలిపిన నీటిని తాగడం వల్ల అనేక అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు. మరి పసుపు, మిరియాలు కలిపిన నీరు తాగితే ఏమి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా ఈ నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి రక్షణ కవచంగా పనిచేస్తాయట. ఈ సమ్మేళనాలు కణాలకు హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ ను తటస్థీకరిస్తాయని, తద్వారా వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో, అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుండి కణాలను రక్షించడంలో సహాయపడతాయని చెబుతున్నారు.
కర్కుమిన్, పైపెరిన్ రెండూ కూడా శక్తివంతమైన సహజ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ రెండూ కలిసి శరీరంలో దీర్ఘకాలిక వాపుకు కారణమయ్యే కారకాలను నిరోధించగలవట. ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల శరీరంలో వాపు, నొప్పి, అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. పసుపు, నల్ల మిరియాల కలయిక జీర్ణ ఎంజైమ్ ల ఉత్పత్తికి తోడ్పడుతుందట. తద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుందని, పసుపు పిత్త ఉత్పత్తిని కూడా పెంచుతుందని, ఇది మనం తిన్న కొవ్వులను సమర్థవంతంగా జీర్ణం చేయడానికి చాలా అవసరం అని చెబుతున్నారు.
పసుపులో ఉండే కర్కుమిన్ ఒక అద్భుతమైన సమ్మేళనం. ఇది మెదడు నుండి ఉత్పన్నమైన న్యూరోట్రోఫిన్ స్థాయిలను పెంచుతుందట. ఈ ప్రోటీన్ మెదడు కొత్త నాడీ కణాలు, కనెక్షన్లను ఏర్పరచడంలో సహాయపడుతుందట. ఈ కలయిక జ్ఞాపకశక్తిని, మానసిక స్థితిని మెరుగుపరచడానికి, వయస్సు సంబంధిత అభిజ్ఞా నష్టం నుండి రక్షించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. కాగా మంచి రోజును ప్రారంభించడానికి, దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి పసుపు, నల్ల మిరియాల నీరు ఒక సరైన డ్రింక్. అయితే ఏదైనా కొత్త ఆహారపు అలవాటును ప్రారంభించే ముందు ఆరోగ్య నిపుణులను సంప్రదించడం ఎల్లప్పుడూ మంచిదని చెబుతున్నారు.