Dubai Princess Divorce Perfume: భర్తకు ‘డైవర్స్’.. ‘డైవర్స్ పర్ఫ్యూమ్’ రిలీజ్ చేసిన యువరాణి
డైవర్స్ పేరుతో సొంతంగా తయారుచేయించిన సరికొత్త పర్ఫ్యూమ్ బ్రాండ్(Dubai Princess Divorce Perfume) ఫస్ట్ లుక్‌ను యువరాణి షేక్ మహ్రా ఆవిష్కరించారు.
- By Pasha Published Date - 01:21 PM, Tue - 10 September 24

Dubai Princess Divorce Perfume: దుబాయ్ యువరాణి షేక్ మహ్రా సోషల్ మీడియా సంచలనంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా భర్తకు విడాకులను ప్రకటించడం ద్వారా ఇటీవలే ఆమె ఒక సెన్సేషన్‌గా అవతరించింది. అంతటా ఆమె గురించే చర్చ జరిగింది. ఇటీవలే భర్తకు అవలీలగా డైవర్స్ చెప్పేసిన షేక్ మహ్రా ఇప్పుడు మరో ‘డైవర్స్’ను తెరపైకి తెచ్చింది. ఈసారి తెరపైకి వచ్చిన డైవర్స్ అంటే విడాకులు కాదండోయ్. అదొక పర్ఫ్యూమ్ బ్రాండ్. డైవర్స్ పేరుతో సొంతంగా తయారుచేయించిన సరికొత్త పర్ఫ్యూమ్ బ్రాండ్(Dubai Princess Divorce Perfume) ఫస్ట్ లుక్‌ను యువరాణి షేక్ మహ్రా ఆవిష్కరించారు.
Also Read :Siddaramaiah Losing Top Post : నేనెందుకు సీఎం కాకూడదో చెప్పండి.. సిద్ధరామయ్య సలహాదారుడి సంచలన కామెంట్స్
డైవర్స్ పేరుతో తయారు చేసిన పర్ఫ్యూమ్ బాటిల్ ఫొటోను ఆమె ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేయడంతో అది వెంటనే వైరల్‌గా మారిపోయింది. ఇటీవలే ఆమె డైవర్స్ తీసుకోవడం.. ఆ వెంటనే డైవర్స్ పేరుతో సెంటు బాటిల్‌ను రిలీజ్ చేయడంపై నెటిజన్లు నానా రకాలుగా చెవులు కొరుక్కుంటున్నారు. డైవర్స్ పర్ఫ్యూమ్ బాటిళ్లను త్వరలోనే తన సొంత బ్రాండ్ ‘మహ్రా ఎమ్1’ ద్వారా మార్కెట్‌లోకి తీసుకొస్తానని దుబాయ్ యువరాణి షేక్ మహ్రా వెల్లడించారు. అయితే దాని ధర ఎంత ఉంటుందనే వివరాలను ఆమె తెలియజేయలేదు.
Also Read :ISRO Vs Egyptian God of Chaos : మన భూమికి ‘అపోఫిస్’ గండం.. రక్షకుడిగా మారిన ఇస్రో
షేక్ మహ్రా గురించి..
- షేక్ మహ్రా ఎవరు అంటే.. దుబాయ్ పాలకుడు, యూఏఈ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తె.
- ఆమె బ్రిటన్‌లో ఉన్నతవిద్యను అభ్యసించింది.
- అంతర్జాతీయ వ్యవహారాల్లో షేక్ మహ్రా పీజీ చేశారు.
- మహిళా సాధికారికతకు ఆమె కృషి చేస్తున్నారు.
- దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త షేక్ మనాబిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్‌తో 2023 మే 27న షేక్ మహ్రాకు పెళ్లయింది.
- పెళ్లి జరిగిన ఏడాది తర్వాత ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. భర్త, కూతురితో దిగిన ఫొటోను దానికి జతపరిచారు. తన జీవితంలో అత్యంత విలువైన జ్ఞాపకం అదేనని ఆ పోస్టులో షేక్ మహ్రా రాసుకొచ్చారు.
- ఆ పోస్టు పెట్టిన కొన్ని రోజులకే షేక్ మహ్రా మరో సంచలన పోస్టు పెట్టారు. ‘మనమిద్దరం మాత్రమే’ అంటూ తన కూతురితో దిగిన మరో ఫొటోను ఆమె పోస్టు చేశారు.
- చివరకు ఈ ఏడాది జులైలో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా భర్త నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు షేక్ మహ్రా ప్రకటించారు. ‘‘ప్రియమైన భర్తకు.. మీరు ఇతరుల సహచర్యం కోరుకున్నందున మీతో విడాకులు తీసుకోవాలని డిసైడయ్యాను. ఐ డైవర్స్ యూ. టేక్ కేర్.. మీ మాజీ భార్య’’ అని ఆ పోస్టులో షేక్ మహ్రా రాయడం సంచలనం క్రియేట్ చేసింది.