HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Do You Suffer From Constipation Often

Constipation Issue: మల బద్ధకం దూరం కావాలంటే ఇలా చేయండి..

మల బద్ధకం.. ఈ సమస్య ఎంతోమందిని వేధిస్తుంటుంది. మల విసర్జన అనేది సాధారణ ప్రక్రియ. శరీరతత్వాన్ని బట్టి ఇది మారుతుంటుంది

  • Author : Hashtag U Date : 18-08-2022 - 6:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Healthy Food On Old Wooden Background
Healthy Food On Old Wooden Background

మల బద్ధకం.. ఈ సమస్య ఎంతోమందిని వేధిస్తుంటుంది. మల విసర్జన అనేది సాధారణ ప్రక్రియ. శరీరతత్వాన్ని బట్టి ఇది మారుతుంటుంది. మల విసర్జన సజావుగా కాకపోవడాన్ని మలబద్ధకంగా పరిగణించవచ్చు. తీవ్ర ఒత్తిడితో విరేచనం అవ్వడం, మల ద్వారంపై ఒత్తిడి పెట్టడం వల్ల పగుళ్లు ఏర్పడటం వంటి వాటిని మల బద్ధకం లక్షణాలుగా చెబుతారు. వీటి వల్ల మల ద్వారం వద్ద తీవ్రమైన నొప్పి, మంట, వాపు, రక్తం కారడం వంటివి జరుగుతుంటాయి. దీర్ఘకాలికంగా మలబద్దకం లేదా తరచూ విరేచనాలు అవ్వడం వంటి సమస్యలను ఎదుర్కొనేవారు ‘ఫిషర్స్‌’ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

కారణాలు ఏమిటి?

మారుతోన్న జీవనశైలితో పాటు, ఆహారం, నీరు ఆరోగ్యకర స్థాయిలో తీసుకోకపోవడం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం వంటి పలు కారణాల వల్ల మల బద్దకం వస్తుంది.

ఆహారంలోనూ లోపం…

ప్రస్తుత బిజీబిజీ యుగంలో చాలా మంది రెడీ టూ ఈట్ ఆహార పదార్థాల వైపు మొగ్గు చూపుతున్నారు. జంక్ ఫుడ్ తీసుకోవడం కూడా మల బద్దకానికి గల కారణాల్లో ఒకటి. ఆహారాన్ని సరైన మోతాదులో తీసుకోక పోవడం వల్ల మలం గట్టిగా మారి విసర్జనకు సమయం తీసుకుంటుంది. ఇది బయటకు రావాలంటే తీవ్ర ఒత్తిడి పెట్టాల్సి ఉంటుంది. ఆహారంలో పీచు పదార్థాలు చాలా తక్కువ మోతాదులో ఉండటం వల్ల విరేచనం సరిగా అవ్వదు.

తగినంత నీరు తాగకున్నా..

రోజుకు కనీసం 3 నుంచి 5 లీటర్ల మంచి నీటిని తాగాలి. దీని కంటే తక్కువ స్థాయిలో నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం తక్కువ అయ్యి డీహైడ్రేషన్ కు గురవుతుంది. అలాంటి సమయంలో శరీరం తనకు కావాల్సిన నీటిని మూత్రం, మలం నుంచి తీసుకుంటుంది. ఫలితంగా మూత్ర సంబంధిత సమస్యలు, మలబద్ధకం వంటివి వస్తుంటాయి.

జీవనశైలిపై కన్నేయండి..

జీవన శైలి సరిగా లేకపోవడం వల్ల కూడా మలబద్ధకం వస్తుంది. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేయడం, శరీరానికి తగినంత శ్రమ ఇవ్వకపోవడం, సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వంటి వాటి వల్ల మలబద్ధకం వస్తుంది.

మలబద్ధకం దూరం కావాలంటే..

డైట్‌లో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు వంటి వాటిని ఎక్కువగా చేర్చాలి.రోజూ మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థాల స్థాయి (ఫైబర్) ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆహారం సులువుగా జీర్ణమవుతుంది. ఫలితంగా మల బద్ధకం సమస్య ఏర్పడకుండా ఉంటుంది.మంచి నీరు, పళ్ల రసాలను ఎక్కువగా తాగాలి.ఇక ఫిషర్స్ సమస్యతో దీర్ఘకాలికంగా బాధపడుతున్న వారు కూడా అజాగ్రత్త వహించకుండా డాక్టర్లను కలవాలి.

నాటు వైద్యం పనిచేస్తుందా?

మలబద్ధకం ప్రారంభ దశలో ఉన్నప్పుడు నాటు వైద్యం తీసుకుంటే ఫలితం ఉండే అవకాశం ఉంది. అయితే కాస్త తీవ్రమయ్యాక నాటు వైద్యం తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నాటు వైద్యం వల్ల మల ద్వారం వద్ద ఏర్పడిన పగుళ్లు (పుండ్లు) మరింత లోతుగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఫలితంగా ఇది ప్రమాదకర ఫిస్ట్యుల్లా వైపునకు దారితీసే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Constipation
  • constipation causes
  • Green Vegetables
  • lifestyle

Related News

Financial Destiny

డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

ఇది కేవలం శుభ్రత కోసం మాత్రమే కాదు ఇంట్లోని శక్తిని శుద్ధి చేయడానికి కూడా. మీ ఇంట్లో అనవసరమైన పాత వస్తువులు లేదా మురికి ఉంటే మీ ఆలోచనలు లేదా ప్రణాళికలు విజయవంతం కావు.

  • Coconut Water

    ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే ఏమ‌వుతుంది?

  • Onion

    పచ్చి ఉల్లిపాయను ఎవరు తినకూడదు?

  • Healthy Lifestyle Tips

    ఆయుర్వేదం కొత్త జీవితాన్ని ఎలా ఇవ్వగలదు?

  • ENT Specialists

    కళ్లు, ముక్కు, చెవులు ఆరోగ్యంగా ఉండాలంటే!

Latest News

  • Ceasefire : సీజ్‌ఫైర్ ముసుగులో అణు కుట్ర? ఇరాన్ దౌత్య నీతికి అమెరికా బలి?

  • Amaravati : అమరావతికి కేంద్రం భారీ నజరా.. రూ.2,534 కోట్లతో ‘సెంట్రల్ సెక్రటేరియట్’ నిర్మాణం!

  • Tata Intra EV Price in 2026 : టాటా మోటార్స్ నుండి ‘ఇంట్రా EV’ పికప్ విడుదల!

  • Whatsapp: మొబైల్ నంబర్ లేకుండానే చాటింగ్.. వాట్సాప్ లో సరికొత్త ఫీచర్

  • University of Malaysia : మలేషియా వర్సిటీతో చెన్నైస్ అమృత ఒప్పందం!

Trending News

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

    • హైవేలపై ప్ర‌యాణించేవారికి బిగ్ అల‌ర్ట్.. ఏప్రిల్ 10 నుంచి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd