HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Do You Have These Symptoms Without A Doubt You Are Addicted To Your Smartphone

Smartphone using: ఈ లక్షణాలు మీలో ఉన్నాయా? నో డౌట్, స్మార్ట్‌ఫోన్‌కు అడిక్ట్ అయినట్లే!!

  • Author : Vamsi Chowdary Korata Date : 26-06-2026 - 11:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Do you have these symptoms? Without a doubt, you are addicted to your smartphone!
Do you have these symptoms? Without a doubt, you are addicted to your smartphone!

స్మార్ట్ ఫోన్ మానవ జీవితంతో ఎంతగా ముడిపడి ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక పూట భోజనం మానేస్తారు కానీ ఫోన్ చూడటం మాత్రం మానేలేరు. అంతలా మన జీవితాన్ని ప్రభావితం చేస్తోంది స్మార్ట్ ఫోన్. స్మార్ట్ ఫోన్ వాడని వ్యక్తులు ఈ సమాజంలో లేరనే చెప్పాలి. అవును, ఇప్పుడు నడుస్తోందే స్మార్ట్ ఫోన్ కాలం. స్మార్ట్ ఫోన్‌ను ఒక నిమిషం కూడా వదలని వారు ఎంతో మంది ఉన్నారు. ఇంకోవిధంగా చెప్పాలంటే దీని మాయలో పడి… బానిసలుగా మారిన వారు చాలా మంది ఉన్నారు.

మనుషుల మధ్య బంధాల కంటే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌తోనే ఎక్కువ సంబంధాలను ఏర్పరుచుకుంటున్నారు. ముఖ్యంగా మనుషులకు స్మార్ట్ ఫోన్లతో విడదీయలేని బంధం ఏర్పడింది. ఫోన్ లేకుండా బతకలేని పరిస్థితిలో ఉన్నారు. కోవిడ్ మహమ్మారి విరుచుకుపడటంతో పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్ల బారిన పడ్డారు. ఫోన్ లేకుంటే ఒక నిమిషం ఒక యుగంలా గడిపేస్తున్నారు. కొంతమందికి ఇది నిత్యవసర వస్తువుగా మారింది. రోజంతా తిండి, నీళ్లు లేకున్నా సరే… కానీ చేతిలో ఫోన్ ఉండాలి. ఇది నమ్మలేని సత్యం. ఎంతో మంది స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారుతున్నారు. ఈ విషయం వాళ్లకు తెలియకపోయినా… ఇదే నిజమని ఏప్రిల్‌లో నిర్వహించిన ఒక సర్వేలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఇతరులతో కనెక్ట్ అయ్యేందుకు 81 శాతం మంది ప్రజలు వీడియో కాల్స్ ఉపయోగించారని సర్వేలో తేలింది.

ఈ 81 శాతం మందిలో 40 శాతం మంది వీడియో కాల్స్‌లో మాట్లాడి… ఫోన్ వాడకం ఎక్కువయ్యి అలసిపోయారన్న విషయాన్ని సర్వే తేల్చింది. ఇక 33 శాతం మంది ప్రజలు తాము ఫోన్‌తో ఎంత సమయం గడిపారు లేదా ఇంటర్నెట్‌లో ఎంత సేపు గడిపామో తెలుసుకునే ప్రయత్నం చేశారని సర్వే చెబుతోంది.

అయితే స్మార్ట్ ఫోన్ వాడకం అనేది చెడ్డ అలవాటు కాదు. ఫోన్లు మనిషి మనిషి మధ్య బంధాలను పెంచుతాయి. ఎన్నో విధాలుగా స్మార్ట్ ఫోన్లు సంతోషపెడుతున్నాయి. కానీ ఏదీ అతిగా చేయకూడదు. అతిగా వాడితే వినాశనానికి దారి తీస్తుందన్న సంగతి తెలిసిందే. కాబట్టి స్మార్ట్ ఫోన్లను పరిమితంగా వాడాలి. అవసరం ఉన్నంత వరకే వాటిని ఉపయోగిస్తుండాలి. లేదంటే ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, షేర్ చాట్ వంటి యాప్స్‌ను చూసే అలవాటును క్రమక్రమంగా తగ్గించుకోండి. మితిమీరి వాడటం వల్ల మీతో పాటు అవతలి వ్యక్తులను కూడా ఇబ్బందులకు గురిచేస్తుంది. ముఖ్యంగా మిమ్మల్ని చూసి అవతలి వ్యక్తులు కూడా ఫోన్‌కు బానిసగా మారే ప్రమాదం ఉంటుంది. ఇక ఏవైనా అప్‌డేట్స్ కోసం అదే పనిగా ఫోన్ వంక చూసేవాళ్లు ఎంతో మంది ఉన్నారు. వారు ‘డూమ్ స్క్రోలింగ్’ సమస్యతో బాధపడుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఏం చేయాలి…?

సామాజిక మాధ్యమాలను చూసే సమయాన్ని తగ్గించుకోవాలి. రోజులో ఎక్కువ సమయం సోషల్ మీడియాకు కేటాయించకూడదు. ఉదయం లేచినప్పుడు, పడుకునేటప్పుడు ఫోన్లను చూడటం మానుకోవాలి. స్మార్ట్ ఫోన్లను చూడటం కంటే యోగా, వ్యాయామం వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. దీంతో సంతోషంగా ఉంటారు, అంతేకాదు ఆరోగ్యంగానూ ఉంటారు. పోషకాలు ఎక్కువగా లభించే ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోండి.

ఇక మొబైల్‌ను ఎక్కువగా వాడుతున్నట్లు మీకు అనిపించినట్లయితే, ఆ అలవాటును మానుకునేలా చేసుకోండి. ఇది మీ మెదడుకు ‘చూసింది చాలు’ అనే సందేశాన్ని చేరుస్తుంది. దీంతో మీరు ఫోన్‌ను ఎక్కువ సేపు చూడలేరు. చిన్నపిల్లలకు స్మార్ట్ ఫోన్లను దూరంగా ఉంచండి. ఈ అలవాటు వారిలో అంధత్వానికి కారణం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్లు ఇస్తూ వారిని గుడ్డివారిగా మారుస్తున్నారని వైద్యులు అంటున్నారు. కాబట్టి పిల్లలు, పెద్దలు స్మార్ట్ ఫోన్లకు ఎంత దూరంగా ఉంటే… వారి ఆరోగ్యం అంత బాగుంటుందని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • addiction
  • excess use of phone
  • mobile addiction
  • Mobile Addiction tips
  • Mobile Phone Addiction
  • smart phones
  • Social Media Addiction
  • texting
  • video calls
  • voice calls
  • WhatsApp Video Calls

Related News

    Latest News

    • Gay dating app: గే డేటింగ్ యాప్‌ను ఉపయోగించి డెలివరీ బాయ్‌ కిడ్నాప్..ఐదుగురు నాగ్‌పూర్ ముఠా అరెస్ట్. ..!

    • Sanjay Jaju: తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్‌ జాజు.. ఉత్తర్వులు జారీ

    • FirstCry Intellitots Preschool: డే కేర్‌లో అమానవీయం.. మరో చిన్నారిని 23 చోట్ల కొరికిన మరో పసిబిడ్డ.. ఆపై రూ. 10 లక్షల లంచం ‘ఆఫర్’ చేసిన యాజమాన్యం

    • Nara Lokesh: ఏపీ ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక

    • Assam: కామాఖ్య ఆలయ తలుపులు తెరవడంతో అంబుబాచి మేళా ముగిసింది.. స్త్రీశక్తికి ప్రతీకగా మేళా వెనుక ఉన్న పురాణ రహస్యం?

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd