Hormones Imbalance: వీటితో హార్మోన్ల అసమతుల్యతకు చెక్ పెట్టేయండి
హార్మోన్ల స్థాయిలో హెచ్చు తగ్గులు ఉంటే మన శరీరంలోని (Body) అవయవాల పనితీరు మందగిస్తుంది.
- Author : Maheswara Rao Nadella
Date : 17-02-2023 - 7:30 IST
Published By : Hashtagu Telugu Desk
పెరుగుతున్న ఒత్తిడి, మారుతున్న జీవనశైలి కారణంగా ఈ రోజుల్లో చాలా మంది హార్మోన్ల అసమతుల్యతతో (Hormones Imbalance) బాధపడుతున్నారు. హార్మోన్ల అసమతుల్యత వల్ల ఇటీవలి కాలంలో థైరాయిడ్, పి.సి.ఓ.డి, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు పెరిగిపోతున్నాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. హార్మోన్లు సక్రమంగా విడుదల కావాలి. హార్మోన్ల స్థాయిలో హెచ్చు తగ్గులు ఉంటే మన శరీరంలోని అవయవాల పనితీరు మందగిస్తుంది. హార్మోన్ల అసమతుల్యత మనలో శారీరక, మానసిక మార్పులకీ, భావోద్వేగాలకీ కారణమవుతుంది.
హార్మోన్ల అసమత (Hormones Imbalance) ఉంటే.. ఆందోళన, జననేంద్రియాల దగ్గర పొడిబారడం, మూడ్‌స్వింగ్స్, జుట్టు విపరీతంగా రాలిపోవడం, అలసట, మొటిమలు వంటి సమస్యలు ఎదురవుతాయి. హార్మోన్లను సమతుల్యం చేయడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. మన డైట్‌లో క్రూసిఫరస్ కుటుంబానికి చెందిన కూరగాయలు తీసుకుంటే.. హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
క్రూసిఫెరస్ (Cruciferous) కూరగాయలు
క్యాబేజీ కుటుంబానికి (Genus Brassica) చెందిన కూరగాయలను క్రూసిఫెరస్ కూరగాయలు అంటారు.
• బ్రోకలీ
• కాలీఫ్లవర్
• కాలే
• బ్రస్సెల్స్ స్ప్రౌట్స్
• బచ్చలికూర
• క్యాబేజీ
ఈ పోషకాలు ఉంటాయి
హార్మోన్లు (Hormones) బ్యాలెన్స్ చేస్తాయి
వీళ్లు తీసుకోవద్దు
క్రూసిఫరస్ కూరగాయల్లో థియోసైనేట్‌లు ఉంటాయి. ఇవి అయోడిన్ శోషణను నిరోధిస్తాయి. థైరాయిడ్ సమస్య ఉన్నవారు క్రూసిఫెరస్ కూరగాయలు ఎక్కువగా తినకూడదని నిపుణులు అంటున్నారు. థైరాయిడ్ పేషెంట్స్.. క్రూసిఫెరస్ కూరగాయలు పచ్చిగా తీసుకోకూడదు. ఇవి ఉడికించి తినవచ్చు.
Also Read: Varicocele: ఒక వృషణం పెద్దగా మరొకటి చిన్నగా ఉందా?