Carrot Dosa: ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ దోశ, ఇలా చేస్తే చాలు లొట్టలు వేసుకొని తినేయాల్సిందే?
- By Sailaja Reddy Published Date - 11:35 AM, Wed - 28 February 24

మాములుగా చాలామంది మార్నింగ్ టిఫిన్ గా దోస ని ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే ఎప్పుడు ఒకే విధమైన దోస కాకుండా కొత్తగా ఏదైనా ట్రై చేయాలనీ అనుకుంటూ ఉంటారు. అయితే ఎప్పుడు అయినా హోటల్ స్టైల్ క్యారెట్ దోసnని తిన్నారా. ఒకవేళ తినకపోతే ఈ రెసిపీ ని ఇంట్లోనే సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు :
బియ్యం – ఒక కప్పు
ఉప్పు – రుచికి సరిపడా
పసుపు – అర స్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూను
మినపప్పు – ఒక కప్పు
తురిమిన క్యారెట్ – ఒక కప్పు
కారం – ఒక టీస్పూను
జీలకర్ర – ఒక టీస్పూను
నూనె – సరిపడా
తయారీ విధానం :
ఇందుకోసం బియ్యం, మినపప్పును నీటిలో కనీసం నాలుగ్గంటలు నానబెట్టాలి. తర్వాత బియ్యం, పప్పును మెత్తగా రుబ్బుకోవాలి. ఆ పిండిని గిన్నెలో వేసి ఒక రాత్రంతా ఉంచాలి. ఇలా చేయడం వల్ల పిండి పులుస్తుంది. మరుసటి రోజు ఉదయం అవసరం అయితే కాస్త నీళ్లు పోసి కలుపుకోవాలి. ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూను నూనె వేసి క్యారెట్ వేసి వేయించాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టే, కారం, జీలకర్ర కూడా వేసి కలపాలి. క్యారెట్ కాస్త వేగాక స్టవ్ కట్టేయాలి. చల్లారాక మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని దోశె పిండిలో వేసి బాగా కలిపేయాలి. స్టవ్ పై పెనం పెట్టి, నూనె వేయాలి. పిండిని దోశెలా పలుచగా వేసుకోవాలి. పైన నూనె చల్లుకోవాలి. క్రిస్పీగా దోశెలు వస్తాయి.