Winter: చలికాలంలో ముఖంపై నిమ్మరసం అప్లై చేయవచ్చా.. చేయకూడదా?
Winter: చలికాలంలో చర్మ సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వారు ముఖంపై నిమ్మరసం అప్లై చేయవచ్చో, చేయకూడదో అప్లై చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 08:33 AM, Thu - 4 December 25
Winter: చలికాలంలో ఎక్కువగా ఇబ్బంది పడే సమస్యల్లో చర్మ సమస్యలు కూడా ఒకటి. చర్మం పగలడం, పెదవులు పొడి బారడం, చర్మం పొడిబారడం వంటి సమస్యలు ఇబ్బందిపెడుతూ ఉంటాయి. అయితే ఈ సమస్యల నుంచి బయట పడటం కోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే చాలామంది ముఖానికి నిమ్మకాయ అప్లై చేస్తూ ఉంటారు.కొందరు నిమ్మకాయను సగానికి కోసి దాని రసాన్ని నేరుగా ముఖంపై రుద్దుతారు. ఇలా అస్సలు చేయకూడదట. దీన్ని నేరుగా అప్లై చేయడం వల్ల నీరు, పాలు లేదా మీ ఫేస్ ప్యాక్ తో కలిపిన దానికంటే ఎక్కువ ప్రభావాలు ఉంటాయని చెబుతున్నారు.
అయితే నిమ్మరసం లేకుండా చర్మాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మీ చర్మం ఆరోగ్యంగా, మెరుస్తూ ఉండాలని మీరు కోరుకుంటే, మీరు మీ చర్మ సంరక్షణ దినచర్యను క్రమబద్ధీకరించుకోవాలట. ముఖ్యంగా, మీరు చర్మ సమస్యలను నివారించాలనుకుంటే, సూర్యకాంతి, అతినీలలోహిత కిరణాల వల్ల దెబ్బతినకుండా ఉండటానికి ప్రతిరోజూ సన్‌స్క్రీన్ ను అప్లై చేయాలనీ చెబుతున్నారు. ఇది పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, సన్‌బర్న్ వాటిని నివారిస్తుందట.
అయితే నిమ్మరసానికి బదులుగా ఏమి అప్లై చేసుకోవచ్చు? అన్న విషయానికి వస్తే.. చర్మ సమస్యలకు చికిత్స చేయడానికి, చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి విటమిన్ సి అధికంగా ఉండే నిమ్మరసాన్ని ఉపయోగిస్తారు.
కానీ బదులుగా, మీరు అదే ప్రయోజనాలను, మరిన్ని పొందాలనుకుంటే, విటమిన్ సి సీరం అప్లై చేసుకోవచ్చట. విటమిన్ సి సీరం యాంటీ ఆక్సిడెంట్లతో రూపొందించబడింది. కాబట్టి దీనిని ఉపయోగించవచ్చట. నిమ్మరసం చర్మానికి పూసుకుంటే మొటిమలు తొలగిపోతాయని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్, ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ ఉంటాయి. ఈ రెండూ నేరుగా పూసినప్పుడు చర్మానికి హానికరం. కాబట్టి నిమ్మరసాన్ని నేరుగా పూయడం వల్ల చర్మం ఉత్పత్తి చేసే సహజ నూనె తగ్గుతుందట. ఇది తేమను తగ్గిస్తుందట. చర్మాన్ని పొడిగా చేస్తుందని మీకు ఇప్పటికే మొటిమలు ఉంటే, అది వాటిని మరింత తీవ్రతరం చేస్తుందని, బొబ్బలు, పూతలకి కూడా కారణమవుతుందని చెబుతున్నారు