Walking: చలికాలంలో ఉదయాన్నే వాకింగ్ చేస్తున్నారా.. అయితే జాగ్రత్త!
Walking: చలికాలం ఉదయాన్నే వాకింగ్ చేసే అలవాటు ఉన్నవారు తప్పకుండా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి అని, కొన్ని జాగ్రత్తలు పాటించాలి అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 07:00 AM, Sun - 7 December 25
Walking: చలికాలం మొదలయ్యింది. రోజురోజుకీ చలి తీవ్రత పెరుగుతూనే ఉంది. అయితే చలికాలంలో పొగ మంచు, చలి కారణంగా వెచ్చని దుస్తులు వేసుకుని బయటికి రావడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. కానీ కొందరు మాత్రం అవేమి పట్టించుకోకుండా వాకింగ్, జాగింగ్ చేస్తుంటారు. అయితే చలికాలంలో వాకింగ్ చేయడం అసలు మంచిది కాదు అని చెబుతున్నారు. ఎందుకో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వాకింగ్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. నడక రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. కేలరీలను బర్న్ చేస్తుంది. అలాగే ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
అదనంగా, మార్నింగ్ వాక్ మంచి సూర్యరశ్మిని అందిస్తుందట. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. శీతాకాలంలో మార్నింగ్ తప్పనిసరిగా ప్రయోజనకరంగా ఉండదట. ఎందుకంటే ఉదయం, సాయంత్రం ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయని, ఈ సమయాల్లో బయట నడవడం హానికరం అని చెబుతున్నారు. చలికాలం ఉదయాన్నే వాకింగ్ చేయడం అస్సలు మంచిది కాదట. దీనివల్ల చల్లటి గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుందట. ఇది బీపీ పెరగడానికి కారణమవుతుందని, గుండెపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు. అంతేకాదు చలి గాలి వల్ల ఇమ్యూనిటీ కూడా వీక్ అవుతుందని, తరచూ జలుబు వచ్చే వారికి ఇది మరింత ప్రమాదకరం అని చెబుతున్నారు.
అలాగే శీతాకాలంలో వాయు కాలుష్య స్థాయిలు పెరుగుతాయి. మీరు ఆస్తమా లేదా ఇతర శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతుంటే, ఉదయం నడక హానికరం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలికాలంలో కీళ్ల నొప్పులు పెరుగుతాయి. నడవడం వల్ల అది మరింత తీవ్రమవుతుందట. అంతేకాదు గుండె ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుందని, మీరు గుండె జబ్బులతో బాధపడుతున్నట్టయితే మార్నింగ్ వాక్ మరింత ప్రమాదకరం అని చెబుతున్నారు. మార్నింగ్ వాక్ చేయాలనుకునే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. స్వెటర్లు, జాకెట్లు, చేతి తొడుగులు, టోపీలు వంటి వెచ్చని దుస్తులు ధరించాలట. ఉదయం 7 నుంచి 8 గంటల తర్వాత సూర్యుడు ఉదయించిన తరువాత మాత్రమే వాకింగ్ కోసం వెళ్లాలని చెబుతున్నారు. బయట కాలుష్యం ఎక్కువగా ఉంటే, వాకింగ్ కోసం వెళ్లకపోవడమే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా నడక ప్రారంభించే ముందు కొద్దిగా వార్మ్ అప్ చేసి ఆ తరువాత నెమ్మదిగా నడవాలని ఎక్కువసేపు నడవకూడదని మీకు ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిదని చెబుతున్నారు.