HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Can Kids Eat Banana And Yogurt During Cold And Cough

‎Kids Health: చిన్నపిల్లలకు దగ్గు జలుబు ఉన్నప్పుడు అరటిపండు పెట్టకూడదా? వైద్యులు ఏం చెబుతున్నారంటే?

‎Kids Health: చిన్నపిల్లలకు దగ్గు జలుబు చేసినప్పుడు అరటిపండును తినిపించవచ్చా తినిపించకూడదా? ఈ విషయం గురించి వైద్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 10-12-2025 - 8:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kids Health
Kids Health

‎Kids Health: కొన్ని కొన్ని సార్లు వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు, ఇతర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చిన్నపిల్లలకు తొందరగా దగ్గు జలుబు వంటివి చేస్తూ ఉంటాయి. అయితే ఇలా దగ్గు, జలుబు ఉన్నప్పుడు పిల్లలు చాలా ఇబ్బంది పడటం మాత్రమే కాకుండా, ఫుడ్ తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా పిల్లలకు జలుబు, దగ్గు ఉన్నప్పుడు ఏ ఫుడ్ పెట్టాలో, ఏ ఫుడ్ పెట్టకూడదో తెలియక చాలామంది తల్లితండ్రులు సతమతమవుతుంటారు. ముఖ్యంగా అరటి పండు, పెరుగు పెట్టొచ్చా లేదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. మరి ఈ విషయం గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
‎
‎ పిల్లలకు జలుబు, దగ్గు వచ్చినప్పుడు కొన్ని ఫుడ్స్ అస్సలు పెట్టొద్దని నిపుణులు చెబుతుంటారు. అయితే చాలామంది పేరెంట్స్ ఆ టైంలో పిల్లలకు అరటి పండు, పెరుగు పెట్టడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఆ ఫుడ్స్ పెట్టడం వల్ల జలుబు పెరుగుతుందని కొందరు, అలాంటిది ఏమి ఉండదని మరికొందరు నమ్ముతారు. అరటిపండులో శరీరానికి కావాల్సిన పొటాషియం, ఫైబర్, విటమిన్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి. అరటిపండు సహజంగా మృదువుగా ఉండటం వల్ల తేలికగా జీర్ణమవుతుందట. సాధారణంగా జలుబు సమయంలో అరటిపండు తింటే ప్రతికూల ప్రభావం ఉన్నట్లుగా ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు.
‎
‎ అయితే కొంతమంది పిల్లల్లో దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు అరటిపండు తిన్న వెంటనే దగ్గు మరింత పెరిగినట్లు అనిపించవచ్చు. కానీ అది పిల్లల శరీరతత్వం మాత్రమే. అలాంటి సందర్భాల్లో అరటిపండును తాత్కాలికంగా తగ్గించడం మంచిదని చెబుతున్నారు. పెరుగు సహజ ప్రోబయోటిక్స్‌తో కూడిన ఆహారం. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో, గట్ హెల్త్ ని కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. జలుబు ఉన్నప్పుడు పెరుగును పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదట. అయితే చల్లగా ఉన్న పెరుగు ఇవ్వకుండా, గది ఉష్ణోగ్రతలో ఉన్న పెరుగు ఇవ్వడం మంచిదని చెబుతున్నారు. పిల్లలకు అరటి పండు, పెరుగు ఇస్తున్నప్పుడు మోతాదుపై శ్రద్ధ అవసరం. పిల్లల రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పుడు, ఏ ఆహారం అయినా ఎక్కువ మోతాదులో ఇస్తే కడుపు నిండిపోవడం, జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు రావచ్చట. కాబట్టి అరటిపండును చిన్న ముక్కల రూపంలో ఇవ్వడం, పెరుగును తక్కువ మోతాదులో ఇవ్వడం సురక్షితం అని చెబుతున్నారు.
‎


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • childrens
  • good foods
  • health tips
  • kids health

Related News

Health Tips

నాలుక కింద ఉప్పు ఉంచితే ఏమవుతుందో తెలుసా?

శరీరంలో డీహైడ్రేషన్ (నీటి శాతం తగ్గడం) వల్ల కూడా తలనొప్పి వస్తుంది. తరచుగా నీళ్లు తాగడం వల్ల తలనొప్పి తీవ్రత తగ్గుతుంది.

  • Health Tips

    అర్ధరాత్రి వేళ పదే పదే విరేచనానికి వెళ్తున్నారా?

Latest News

  • గూగుల్ కొత్త ప్రైవసీ టూల్ అంటే ఏమిటి?

  • న‌మీబియాపై భార‌త్ భారీ స్కోర్‌.. రాణించిన ఇషాన్ కిష‌న్‌, పాండ్యా!

  • చెక్ బౌన్స్ అయితే ఎంత న‌ష్టమో తెలుసా?!

  • పవన్ కళ్యాణ్ తో బాలకృష్ణ భేటీ ! ఏంమాట్లాడి ఉంటారో అనే చర్చ !!

  • మహాశివరాత్రి నుంచి ఈ రాశుల వారి ద‌శ తిరిగిన‌ట్లే!

Trending News

    • ఏఐ వాడుతున్నారా? అయితే ఇక‌పై జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

    • బౌలింగ్ యాక్షన్.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

    • ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోవడానికి స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ ఇదే!

    • ఏప్రిల్ 1 నుండి మారనున్న ప్ర‌త్యేక‌ నిబంధనలు ఇవే!

    • రైల్వే ప్ర‌యాణికుల‌కు మ‌రో అదిరిపోయే సూప‌ర్ న్యూస్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd