Brown Rice Dosa : బ్రౌన్ రైస్ దోసెని ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?
ఒకసారి బ్రౌన్ రైస్(Brown Rice) తో దోసెలు(Dosa) ట్రై చేస్తే అవి రుచిగాను మరియు మనకు ఆరోగ్యంగాను ఉంటాయి.
- By News Desk Published Date - 04:00 PM, Thu - 4 January 24

మనం అందరం దోసెలు వేసుకుంటూ ఉంటాము. బియ్యం(Rice), మినప్పప్పుతో దోసెలు వేసుకుంటాం. అయితే ఒకసారి బ్రౌన్ రైస్(Brown Rice) తో దోసెలు(Dosa) ట్రై చేస్తే అవి రుచిగాను మరియు మనకు ఆరోగ్యంగాను ఉంటాయి.
బ్రౌన్ రైస్ దోసె తయారీకి కావలసిన పదార్థాలు..
* రెండు కప్పుల బ్రౌన్ రైస్
* పావు కప్పు అటుకులు
* రెండు స్పూన్ల శనగపప్పు
* అర కప్పు మినపపప్పు
* తగినంత ఉప్పు
* హాఫ్ స్పూన్ మెంతులు
బ్రౌన్ రైస్ దోసె తయారీ చేయు విధానం..
బ్రౌన్ రైస్ ను ముందుగా శుభ్రంగా నీళ్ళు పోసి కడిగి వేడి నీళ్ళు లేదా నీళ్ళు పోసి నానబెట్టాలి. ఇప్పుడు ఆ బియ్యంలో శనగపప్పు, అటుకులు, మెంతులు, మినపపప్పు కూడా వేసి ఆరు గంటల పాటు నానబెట్టాలి. నానిన తరువాత దానిని గ్రైండర్ లో వేసి దోసెల పిండి లాగా రుబ్బుకోవాలి. దానిని ఒక పూట తరువాత వాడుకోవాలి. అప్పుడే దోసెలు ఎంతో రుచిగా ఉంటాయి. ఆ పిండితో పెనం మీద దోసెలు వేసుకుంటే రుచికరమైన దోసెలు రెడీ అయినట్లే. ఇక ఈ దోషాలకు మాములు పల్లి చట్నీ లేదా కొబ్బరి, ఇంకేదైనా చట్నీలతో కూడా తినొచ్చు.
Also Read : Beauty Tips: ముఖం తల తల మెరిసిపోవాలంటే శనగపిండిలో ఇవి కలిపి రాయాల్సిందే?