Black Salt: మీ అందం రెట్టింపు అవ్వాలంటే బ్లాక్ సాల్ట్ తో ఇలా చేయాల్సిందే!
మీ అందం రెట్టింపు అవ్వాలంటే బ్లాక్ సాల్ట్ తో కొన్ని రెమిడీలు ఫాలో అవ్వాలని చెబుతున్నారు..
- By Anshu Published Date - 03:00 PM, Wed - 18 September 24

నల్ల ఉప్పు.. దీనినే బ్లాక్ సాల్ట్, కాలా నమక్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ బ్లాక్ సాల్ట్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. బ్లాక్ సాల్ట్ ని ఆయుర్వేదంలో ఎప్పటి నుంచో వినియోగిస్తున్నారు. దీనిని తరచుగా తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే బ్లాక్ సాల్ట్ వల్ల ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. బ్లాక్ సాల్ట్ ని మెరిసే చర్మం కోసం క్లెన్సర్ గా వాడుకోవచ్చు. అంతేకాకుండా మన ముఖ సౌందర్యాన్ని చర్మ సౌందర్యాన్ని మరింత పెంచుకోవచ్చు అని చెబుతున్నారు.
మరి అందుకోసం బ్లాక్ సాల్ట్ తో ఏం చేయాలి అన్న విషయానికి వస్తే.. ఒక గిన్నెలో నల్ల ఉప్పు బేకింగ్ సోడా, ఆలివ్ ఆయిల్, మీకు ఇష్టమైన నూనె కొన్ని చుక్కలు జోడించాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలిపి మోకాలు మరియు మోచేతులపై ఎక్కువ శ్రద్ధతో మిగిలిన చర్మంపై కాస్త మృదువుగా వృత్తాకార కదలికలతో స్క్రబ్ చేయాలి. సున్నితమైన ప్రాంతాలని స్క్రబ్ చేయకూడదు. తర్వాత గోరువెచ్చని నీటితో శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మంపై ఉండే లోతైన మురికి శుభ్రపడుతుంది. ఇది అధిక నూనెను దూరంగా ఉంచి ఆ ప్రాంతంలో రక్తప్రసరణను ప్రోత్సహిస్తుంది.
అలాగే పసుపు రంగు గోళ్ళను నార్మల్గా చేయడంలో కూడా బ్లాక్ సాల్ట్ బాగా ఉపయోగపడుతుంది. నీటిలో కొంత నల్ల ఉప్పుని కరిగించి కాటన్ బాల్స్ ని ఉపయోగించి మీ గోళ్ళ పై అప్లై చేయాలి. ఇలా చేస్తే మీ గోళ్ళపై ఉండే పసుపుదనం పోతుంది. అయితే దీనిని కొద్దిగా మర్దనా చేస్తున్నట్లుగా రాయండి. అరగంట తర్వాత మీ చేతులను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయటం వలన మీ గోళ్లు మెరుపుని సంతరించుకుంటాయి. ఎందుకంటే బ్లాక్ సాల్ట్ కి అసలు రంగును తిరిగి ఇచ్చే ఉన్నతమైన ఎక్స్ ఫోలియేటింగ్ లక్షణాలు ఉంటాయి. అలాగే ఈ బ్లాక్ సాల్ట్ ని సలాడ్స్ మీద ఉడికించిన కోడిగుడ్డు మీద జోడించి తినటం వలన ఖనిజాలు అధికంగా లభించే అదనపు బరువుని తగ్గిస్తుందట.