Gardening And Health: మొక్కలు పెంచడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..?
మొక్కల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే తెలిసి తెలియక ఎవరైనా కానీ
- By Anshu Published Date - 07:00 AM, Thu - 25 August 22

మొక్కల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే తెలిసి తెలియక ఎవరైనా కానీ మొక్కలని పీకేస్తుంటే మాత్రం అలా చేయకండి. ఇప్పటి నుంచి మొక్కలను పెంచడం నేర్చుకోండి. మరి మొక్కల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం వెళ్లే ప్రతి చోట అంటే ఇల్లు, ఆఫీసుకు ఇలా ప్రతి ఒక్కచోట్ల కూడా మొక్కలను పెంచడం అలవాటు చేసుకోవడం వల్ల మనం తిరిగే ప్రతి ప్రాంతంలో కూడా మెరుగైన ఆక్సిజన్ పొందవచ్చు. మొక్కలు పెంచడం వల్ల ఒత్తిడి ఆందోళన తగ్గుతాయి.
మొక్కల మధ్య రోజు కాసేపు సమయాన్ని గడపడం వల్ల ప్రశాంతత చేకూరుతుంది. అదేవిధంగా మానసిక సమస్యలు ఉన్నవారికి మొక్కలు పెంచడం ఒకతెరపి లాగా పని చేస్తుంది. అదేవిధంగా వ్యసనాలు మాన్పించడం కోసం చాలామందికి మొక్కలను పెంచే హార్టికల్చర్ తెరపిని అందిస్తూ ఉంటారు. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే ఆరు బయట గార్డెనింగ్ చేయడం వల్ల రోజుకి సరిపడినంత విటమిన్ డి లభిస్తుంది. అదేవిధంగా ఒబిసిటీ ఉన్నవారు రోజు మొక్కలకు నీళ్లు పోయడం, వాటికి పాలు చేయడం లాంటివి పనులు చేస్తే ఎన్నో క్యాలరీలు కూడా ఖర్చు అవుతాయి.
అదేవిధంగా గార్డెనింగ్ ఉన్నవారికి ఆత్మవిశ్వాసం సహనం ఎక్కువ ఉన్నట్టు కొన్ని అధ్యయనాల్లో తేలింది. అదేవిధంగా మొక్కలు పెంచడం వల్ల ఇంటి పట్టున ఉండే హౌస్ వైవ్స్ కి మంచి శారీరక శ్రమ అందుతుంది. ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇదే కాకుండా మొక్కల వల్ల ఇంకా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మొక్కలు మనకు కావాల్సిన ఆక్సీజన్ అందించడంతోపాటుగా ఇంటికి కావలసిన కలపను కూడా అందిస్తుంది.