HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Benefits Of Drinking Tulsi Water On Empty Stomach

‎Tulsi Water: ఉదయాన్నే పరగడుపున తులసి నీరు తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

‎Tulsi Water: ఉదయాన్నే పరగడుపున తులసి నీరు తాగడం వల్ల అనేక అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 31-10-2025 - 7:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tulsi Water
Tulsi Water

Tulsi Water: తులసి వల్ల ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా తులసి నీటి వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు. మరి తులసి నీటి వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వర్షాకాలంలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఈ సీజన్ లో ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వంటి చాలా సమస్యలు వస్తుంటాయి. సమస్య వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే, ఆ ప్రాబ్లమ్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం అని చెబుతున్నారు.
‎
‎అలా చేయడంలో తులసి నీరు బాగా పని చేస్తుందట. ఒక గ్లాసు నీటిలో 7 నుంచి 10 తాజా తులసి ఆకులను వేసి బాగా మరిగించాలి. నీరు సగం వరకు మరిగిన తర్వాత ఆ నీటిని వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఇందులో మీరు కొద్దిగా తేనె లేదా నిమ్మరసం కలిపితే రుచి బాగుంటుందట. వర్షాకాలంలో బ్యాక్టీరియా, వైరస్ లు వేగంగా వ్యాపిస్తాయి. తులసి నీటిలో ఉండే యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు మన శరీర రక్షణ వ్యవస్థను బలపరుస్తాయట. ప్రతిరోజూ ఉదయం ఈ తులసి నీరు తాగడం వల్ల జలుబు, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్లను దూరంగా ఉండవచ్చని చెబుతున్నారు. ‎కాగా వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడంతో శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. తులసి నీరు సహజంగా ఊపిరితిత్తుల్లోని కఫాన్ని కరిగించి, శ్వాసనాళాలను శుభ్రంగా ఉంచుతుందట.
‎
‎ ఇది ఆస్తమా లేదా అలర్జీతో బాధపడే వారికి కూడా ఉపశమనం ఇస్తుందని చెబుతున్నారు. తులసి నీరు జీర్ణవ్యవస్థను బలపరుస్తుందట. పరగడుపున తాగడం వల్ల ఆమ్లత్వం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయట. వర్షాకాలంలో జీర్ణక్రియ మందగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, తులసి నీరు అద్భుత పరిష్కారంగా పని చేస్తుందట. అదేవిధంగా తులసి ఆకుల్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తాయట. ఇది రక్తాన్ని శుద్ధి చేసి చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుందట. ప్రతిరోజూ ఉదయం తులసి నీరు తాగడం వల్ల చర్మం సహజంగా మెరుస్తుందట. మొటిమలు కూడా తగ్గుతాయని చెబుతున్నారు.
‎తులసి సహజంగా మన నరాల వ్యవస్థను శాంతపరుస్తుందట. గోరువెచ్చని తులసి నీరు ఉదయం తాగడం రోజంతా ఉత్సాహంగా ఉండటానికి సహాయపడుతుందని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits of tulsi water
  • health benefits
  • health tips
  • tulsi water

Related News

Are you gaining weight due to thyroid issues? Then do this immediately—you won't gain any weight at all!

Thyroid: థైరాయిడ్ వల్ల బరువు పెరుగుతున్నారా? అయితే వెంటనే ఇలా చేయండి.. అస్సలు బరువు పెరగరు!

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్యలలో థైరాయిడ్ సమస్య కూడా ఒకటి. ప్రతి పదిమందిలో నలుగురు ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. థైరాయిడ్ సమస్యతో బాధపడే వారిలో ముఖ్యంగా కనిపించే ప్రధాన లక్షణం అధిక బరువు. థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళు చాలామంది అధిక బరువు సమస్యతో కూడా బాధపడుతూ ఉంటారు. ఈ థైరాయిడ్ సమస్య కారణంగా విపరీతంగా బరువు పెరగడం వల్ల ఇతర అనార

  • A juice that boosts sexual desire... Drinking this juice will improve your sex life.

    Romantic Life: శృంగార వాంఛలను పెంచే జ్యూస్.. ఈ జ్యూస్ తాగితే మీ శృంగార జీవితం మెరుగుపడుతుంది..

Latest News

  • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

  • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

  • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

  • Rains: తెలంగాణకు భారీ వర్షసూచన

  • Amaravati Farmers: వైకాపా నేతల పర్యటనను అడ్డుకున్న రాజధాని రైతులు

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd