Adeno Virus: ఈ కొత్త అడెనో వైరస్ తో జాగ్రత్త. వైరస్ లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే..!
కరోనా రక్కసి నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం అనుకునే సమయంలో మరో కొత్త వైరస్ ఇప్పుడు ప్రజలను కలవరపెడుతుంది.
- Author : Maheswara Rao Nadella
Date : 25-02-2023 - 3:30 IST
Published By : Hashtagu Telugu Desk
కరోనా రక్కసి నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం అనుకునే సమయంలో మరో కొత్త వైరస్ ఇప్పుడు ప్రజలను కలవరపెడుతుంది. ఈ వైరస్ పేరే అడెనో వైరస్ (Adeno Virus). ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ప్రజలను ఈ వైరస్ టెన్షన్ పెట్టిస్తుంది. ఈ వైరస్ ధాటికి అధిక సంఖ్యలో చిన్నపిల్లలు ఆసుపత్రి పాలవుతున్నారు. అలాగే పేదవారిని కూడా ఈ వైరస్ వదిలిపెట్టడం లేదు. జనవరి నుండి క్రమంగా ఈ వైరస్ విజృంభిస్తుందని తెలుస్తుంది. అసలు ఈ అడెనో వైరస్ (Adeno Virus) లక్షణాలు ఏంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ వైరస్ బారిన పడ్డవారిలో జలుబు, జ్వరం, ఊపిరి తిత్తుల సమస్య, నిమోనియా వంటి లక్షణాలు కనిపిస్తాయట. ఈ వైరస్ సోకిన వారు దగ్గడం, తుమ్మడం వల్ల ఇతరులకు వ్యాపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ వైరస్ గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు, శ్వాసకోస సంబంధ వ్యాధులున్న వారు, కిడ్నీ సంబంధిత రోగులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఎక్కువ ప్రభావం చూపిస్తుందని సమాచారం. స్వాబ్ టెస్ట్ ద్వారా ఈ వైరస్ ను గుర్తిస్తారు. ఈ వైరస్ సోకిన వారికి ప్రత్యేక చికిత్స ఏమిలేదు. లక్షణాలను బట్టి చికిత్స అందిస్తారు. అయితే ఈ వైరస్ సోకకుండానే జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు ధరించడం తప్పనిసరని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే తరచూ ముక్కు, కళ్లను తాకకూడదని కరచాలనాలు మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అనారోగ్య సమస్యలుంటే ఇంట్లోనే ఉండడం మంచిది. అలాగే తరచూ సబ్బుతో చేతులు కడుక్కోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వైరస్ సోకిన వారికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
Also Read: Garlic: ఈ 4 సమస్యలు ఉన్నవారు వెల్లుల్లి తింటే అనారోగ్య సమస్యలు తప్పవు