Barbie New Look : టైప్ 1 డయాబెటిస్‌పై అవగాహన కోసం మాట్టెల్ ప్రత్యేక బొమ్మ
Barbie New Look : ప్రపంచ ప్రఖ్యాత బొమ్మల తయారీ సంస్థ మాట్టెల్ తమ బార్బీ బొమ్మల ద్వారా మరోసారి సామాజిక బాధ్యతను చాటుకుంది.
- By Kavya Krishna Published Date - 11:41 AM, Wed - 9 July 25

Barbie New Look : ప్రపంచ ప్రఖ్యాత బొమ్మల తయారీ సంస్థ మాట్టెల్ తమ బార్బీ బొమ్మల ద్వారా మరోసారి సామాజిక బాధ్యతను చాటుకుంది. టైప్ 1 డయాబెటిస్‌తో జీవించే చిన్నారుల కోసం, వారిలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంచేలా ఒక ప్రత్యేక బార్బీ బొమ్మను మార్కెట్లోకి తీసుకువచ్చింది. పిల్లలు ఆడుకునే బొమ్మల్లో వాస్తవ ప్రపంచాన్ని ప్రతిబింబించేలా ఉండాలన్న మాట్టెల్ నిబద్ధతకు ఇది మరో కీలక అడుగు.
Tea : “టీ”లో యాలకులు వేసుకొని తాగుతున్నారా..? ఇది మంచిదేనా.?
మాట్టెల్ ‘ఫ్యాషనిస్టాస్’ సిరీస్‌లో భాగంగా ఆవిష్కరించిన ఈ ప్రత్యేక బార్బీ చేతికి గ్లూకోజ్ మానిటర్, నడుముకు ఇన్సులిన్ పంప్ అమర్చారు. అంతేకాదు, గ్లూకోజ్ రీడింగ్ ట్రాకింగ్ చేసే మొబైల్ ఫోన్, స్నాక్స్ లేదా వైద్య పరికరాల కోసం చిన్న పర్సు కూడా ఈ బొమ్మకు ఇవ్వడం జరిగింది. నీలి చుక్కల డ్రెస్‌లో దర్శనమిచ్చే ఈ బార్బీ పిల్లల వైద్య అనుభవాలకు దగ్గరగా ఉంటుంది.
ఈ బొమ్మ రూపకల్పనలో డయాబెటిస్‌పై పరిశోధనలు చేసే “బ్రేక్‌త్రూ టీ1డీ” సంస్థతో మాట్టెల్ కలిసి పని చేసింది. వైద్య పరికరాలను నిజ జీవితానికి దగ్గరగా డిజైన్ చేసేందుకు నిపుణుల బృందం విశేషంగా శ్రమించింది. “ఇలాంటి బొమ్మల ద్వారా పిల్లల్లో ధైర్యం పెరుగుతుంది. డయాబెటిస్‌పై అవగాహన పెరగడం మా లక్ష్యం” అని మాట్టెల్ ప్రతినిధి క్రిస్టా బెర్గర్ తెలిపారు.
ఇది మాట్టెల్ చేసిన తొలి సామాజిక ప్రయోగం కాదు. 2024 జులైలో దృష్టిలోపం ఉన్న చిన్నారుల కోసం తెల్లటి చేతికర్ర, కళ్లద్దాలు, బ్రెయిలీ లిపి గల బార్బీని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి బొమ్మల ద్వారా పిల్లల్లో వైకల్యాల పట్ల అవగాహన, ఆమోదం పెరిగేలా చూడడమే మాట్టెల్ లక్ష్యమని సంస్థ స్పష్టం చేసింది.
Sridevi Apalla : కోర్ట్ మూవీ హీరోయిన్ పెళ్లి..అసలు నిజం ఇదే !!