HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Bad Breath Treatment Five Home Remedies To Get Rid Of Foul Breath

Bad Breath Treatment: నోటి దుర్వాసన ఎలా పోతుందంటే..?

చాలా మంది నోటి దుర్వాసనతో బాధపడుతుంటారు. ఈ సమస్య ఉన్నవాళ్ల కారణంగా పక్కవారూ ఇబ్బంది పడుతుంటారు. ఇంతకీ ఈ ప్రాబ్లమ్ ఎందుకు వస్తుంది.. ? అది వస్తే ఏం చేయాలి.. ? ఇప్పుడు తెలుసుకుందాం..!

  • By Gopichand Published Date - 02:12 PM, Fri - 3 February 23
  • daily-hunt
Bad Breath
Resizeimagesize (1280 X 720) (2) 11zon

చాలా మంది నోటి దుర్వాసన (Bad Breath)తో బాధపడుతుంటారు. ఈ సమస్య ఉన్నవాళ్ల కారణంగా పక్కవారూ ఇబ్బంది పడుతుంటారు. ఇంతకీ ఈ ప్రాబ్లమ్ ఎందుకు వస్తుంది.. ? అది వస్తే ఏం చేయాలి.. ? ఇప్పుడు తెలుసుకుందాం..!

● నోటి దుర్వాసన కారణాలు

◆ తక్కువ నీళ్లు తాగే వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
◆దీర్ఘకాల నోటి వ్యాధుల వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంటుంది.
◆ ఆహారాల్లో ఉండే దుర్వాసన గల నూనెలు.. ఊపిరితిత్తులకు చేరినప్పుడు కూడా నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది.
◆ నిద్రలేచిన తరువాత ఎక్కువ సమయం దాకా మాట్లాడకుండా ఉన్నప్పుడు, ఆహారాన్ని ఎక్కువ సమయం దాకా తీసుకోకుండా ఉన్నప్పుడు లాలాజలం విడుదల తగ్గి నోటిలో దుర్వాసన సమస్య తలెత్తుతుంది.
◆ఉదయం, రాత్రి భోజనం తరువాత దంతాలను తోమాలి. తద్వారా దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇలా చేయకపోవడం వల్ల నోట్లో స్మెల్ వస్తుంటుంది.
◆ కొవ్వు పదార్థాలు, ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసం, కోడిగుడ్లు, టీ ఇంకా కాఫీ వంటి పదార్థాలను తీసుకున్నప్పుడు కూడా నోటి దుర్వాసన అనేది ఎక్కువగా వస్తుంది.

● నోటి దుర్వాసనపై పోరాడే ఫుడ్స్ ఇవీ

◆గ్రీన్ టీ: గ్రీన్ టీలో కాటెచిన్ అనే ఎనర్జిటిక్ యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది నోటి దుర్వాసన కలిగించే సల్ఫర్ సమ్మేళనాలను తగ్గించడం ద్వారా నోటిలో బ్యాక్టిరియాను నిరోధిస్తుంది.

◆విటమిన్ సి ఫ్రూట్స్: నిమ్మ, దానిమ్మ, యాపిల్, బత్తాయి, నారింజ వంటి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి బ్యాక్టిరియాను కంట్రోల్ చేయడానికి మాత్రమే కాకుండా.. చిగుళ్ల వ్యాధులు, చిగురువాపుతో పోరాడటానికి సహాయపడుతాయి.

◆ పెరుగు: పెరుగులో ప్రో బయోటిక్స్ ఉంటాయి. ఇది దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. పెరుగులో విటమిన్ డి కూడా పుష్కలంగా ఉండటంతో శరీరంలో క్రిములు పెరగడాన్ని తగ్గిస్తుంది.

◆ తులసి: తులసిలోని పాలీఫెనాల్స్ అనే సహజ అణువులు నోటి దుర్వాసనను తగ్గిస్తాయి. తులసిని ఏ విధంగా తీసుకున్నా.. నోటి దుర్వాసనను తగ్గిస్తుంది.

◆ అల్లం: అల్లంలో ఉండే 6-జింజెరాల్ నోటిలోని సల్ఫర్ సమ్మేళనాల విచ్ఛినానికి సహాయపడే లాలాజల ఎంజైమ్ ను ఇస్తుంది. అల్లం లేదా అల్లం ఉపయోగించిన పదార్థాలను తీసుకుని నోటి దుర్వాసనను కంట్రోల్ చెసుకోవచ్చు.

◆నిమ్మకాయ రసం: నోటి నుంచి బ్యాడ్‌ స్మెల్‌ వస్తే వెంటనే నీరు తాగండి. వీలుంటే నీటిలో నిమ్మకాయ రసం వేసి తాగితే ఇంకా మంచిది.

◆సోంపు: భోజనం చేసిన తరువాత టీస్పూన్‌ సోంపు తిన్నా నోటి దుర్వాసన తగ్గి, నోరు ఫ్రెష్‌ అవుతుంది. భోజనం చేశాక ఒకటి రెండు పుదీనా లేదా తులసి ఆకులను అలాగే పచ్చిగా నమిలేయాలి. దీంతో నోటి దుర్వాసన సమస్య నుంచి బయట పడవచ్చు.

◆ వేప, చండ్ర: వేప, చండ్ర ఇంకా అలాగే తుమ్మ వంటి చెట్టు పుల్లలతో దంతాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ లు ఈజీగా తగ్గి నోటి దుర్వాసన రాకుండా ఉంటుంది. లవంగాలను చప్పరించడం వల్ల కూడా ఈ సమస్య నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు.

◆ దోర జామకాయ: దోర జామకాయను దంతాలతో కొరికి నమిలి తినడం వల్ల కూడా నోటి దుర్వాసన సమస్య చాలా ఈజీగా తగ్గుతుంది.

◆ సోంపు, జీలకర్ర, ఏలక్కాయ: సోంపు, జీలకర్ర, ఏలక్కాయ, దాల్చిన చెక్క వంటి వాటిని వక్కపొడిలా చేసుకుని నములుతూ ఉంటే నోటి ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు దుర్వాసన సమస్య కూడా తగ్గుతుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bad Breath
  • Bad Breath Treatment
  • curd
  • green tea
  • treatment

Related News

‎weight Loss

‎Weight Loss: గ్రీన్‌ టీ, మునగాకు టీ.. బరువు తగ్గాలి అనుకున్న వారికి ఏది మంచిదో తెలుసా?

‎Weight Loss: బరువు తగ్గాలి అనుకున్న వారికి గ్రీన్ టీ అలాగే మునగాకు టీలలో ఏది మంచిది. దేని వల్ల ఎక్కువ ఫలితాలు కలుగుతాయి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd