Dark Circles: కంటి కింద డార్క్ సర్కిల్స్ తో ఇబ్బంది పడుతున్నారా.. అయితే వీటిని ట్రై చేయాల్సిందే!
కంటి కింద నల్లటి వలయాలతో ఇబ్బంది పడుతున్న వారు తప్పకుండా కొన్ని సింపుల్ టిప్స్ ని ఫాలో అవ్వాలని, తద్వారా త్వరగా ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.
- By Anshu Published Date - 03:00 PM, Thu - 5 December 24

కంటి కింద డార్క్ సర్కిల్స్ ఏర్పడడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. డాక్టర్ సర్కిల్స్ రావడం సులువే కానీ వాటిని పోగొట్టుకోవడం అన్నది చాలా కష్టం. అందుకోసం చాలామంది రకరకాల బ్యూటీ ప్రాడక్టులు ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకొందరు మేకప్ తో కవర్ చేస్తూ ఉంటారు. మీకు తెలుసా మనకు అందుబాటులో ఉన్న కొన్నింటిని ఉపయోగించి ఈ డార్క్ సర్కిల్ సమస్యకు పూర్తిగా చెక్ పెట్టవచ్చట. మరి ఆ సింపుల్ రెమెడీస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అర టీస్పూన్ త్రిఫలా పొడిని కొన్ని చుక్కల నీళ్లతో కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి.
ఈ పేస్ట్‌ని మీ కళ్ల కింద అప్లై చేసి 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. త్రిఫల పిగ్మెంటేషన్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. నల్లటి వలయాలను తగ్గిస్తుందని చెబుతున్నారు. అలాగే అలోవెరా జెల్ కళ్ళ కింద అప్లై చేసి 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయట. ఈ జెల్ కళ్లు ఉబ్బినట్లుగా ఉండటాన్ని తగ్గిస్తుంది. నల్లటి వలయాలను తగ్గిస్తాయి. అలాగే కీర దోసకాయ ముక్కలను కళ్ళపై 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచి విశ్రాంతి తీసుకోవాలి.
ఇలా చేయడం వల్ల నల్లటి వలయాలు తగ్గిపోతాయట. ఒక టీస్పూన్ పసుపు పొడిని కొన్ని చుక్కల పైనాపిల్ జ్యూస్ తో కలిపి పేస్ట్‌లా తయారు చేయాలి. ఈ పేస్ట్‌ని మీ డార్క్ సర్కిల్స్ పై అప్లై చేసి, పది నుంచి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల నల్లటి వలయాలను తగ్గేలా చేస్తుందట. అలాగే రాత్రి పూట పడుకునే ముందు కొంచెం బాదం నూనె తీసుకుని మీ కళ్ళ కింద అప్లై చేసి మసాజ్ చేసి ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత చల్లనీటితో ముఖం కడుక్కుంటే నల్లటి తగ్గుతాయట. రోజ్ వాటర్‌లో కాటన్ ప్యాడ్‌లను నానబెట్టి, వాటిని మీ మూసిన కళ్లపై ఉంచి, 10 నుంచి 15 నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు.