Good Sleep : హాయిగా నిద్రపోవాలంటే…వీటికి దూరంగా ఉండండి..!!
ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాహారమే ఒక్కటే సరిపోదు..కంటినిద్రా ఉండాల్సిందే. హాయిగా నిద్రపోవాలంటే సరైన జీవన విధానాన్ని అలవరచుకోవాలి.
- By hashtagu Published Date - 10:14 PM, Tue - 6 September 22
ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాహారమే ఒక్కటే సరిపోదు..కంటినిద్రా ఉండాల్సిందే. హాయిగా నిద్రపోవాలంటే సరైన జీవన విధానాన్ని అలవరచుకోవాలి. దీంతోపాటు మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారంపై కూడా శ్రద్ధపెట్టాల్సిందే. మనం తీసుకునే ఆహారమే…మన ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ప్రతిఒక్కరూ రోజుకు 7 నుంచి 8 గంటలపాటు తప్పకుండా నిద్రపోవాలి. అప్పుడే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. అయితే రాత్రి హాయిగా నిద్రపోవాలంటే కొన్ని ఆహారపదార్థాలకు తప్పకుండా దూరంగా ఉండాల్సిందే. అవేంటో చూద్దాం.
కాఫీ, టీ జోలికి అస్సలు వెళ్లకూడదు:
రాత్రి కంటి నిండా నిద్రపట్టాలంటే …కాఫీ టీలకు దూరంగా ఉండాలి. పడుకునే ముందుకు కెఫిన్ పదార్థాలకు దూరంగా ఉండాలి. వీటిని తీసుకున్నట్లయితే సరిగ్గా నిద్రపట్టదు.
పిండి పదార్థాలకు దూరంగా:
బ్రౌన్ రైస్, పాస్తా, బ్రెండ్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇవి తింటే రాత్రి సరిగ్గా నిద్రపట్టదు.
బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి:
శరీరానికి సరిపడా ఆహారం తీసుకోవాలి. లేదంటా రాత్రి నిద్రపట్టదు. మనం తీసుకునే ఆహారం ఎప్పుడూ కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ప్రొటీన్స్, ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
నీళ్లు తాగాలి:
రాత్రిపడుకునే ముందు కాకుండా రోజుకు ఎనిమిది నుంచి పది గ్లాసుల నీళ్లు తాగాలి. అలా తాగితేనే ఆరోగ్యం బాగుంటుంది. లేదంటే డీహైడ్రేషన్ సమస్యలతోపాటు మరెన్నో సమస్యలు ఇబ్బంది పెడతాయి.
Related News
Long Sitting Side Effects: ఎక్కువ సేపు కూర్చొని వర్క్ చేస్తున్నారా..? అయితే మీరు ఈ వ్యాధులకు వెల్కమ్ చెప్పినట్లే..!
నేటి జీవనశైలిలో తక్కువ శారీరక శ్రమ కారణంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది.