Rice Water: బియ్యం కడిగిన నీళ్లు పారబోస్తున్నారా..!? ఇది మీకోసమే!
ఎవరైనా బియ్యాన్ని కడిగిన తర్వాత నీళ్లను మొక్కల్లో పోస్తారు. దీని వల్ల మొక్కలు బాగా పెరుగుతాయి. ఈ నీళ్లను మొక్కలకు పోయటమే కాకుండా జుట్టు ఒత్తుగా...
- By Maheswara Rao Nadella Published Date - 07:00 PM, Thu - 16 March 23

ఎవరైనా బియ్యాన్ని (Rice) కడిగిన తర్వాత నీళ్లను మొక్కల్లో పోస్తారు. దీని వల్ల మొక్కలు బాగా పెరుగుతాయి. ఈ నీళ్లను మొక్కలకు పోయటమే కాకుండా జుట్టు ఒత్తుగా పెరగటానికి కూడా ఉపయోగించుకోవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. బియ్యంలో కార్బొహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇనోసిటోల్ అనే ఒక కార్బోహైడ్రేట్ వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఈ కార్పొహైడ్రేట్ సాధారణంగా బియ్యం కడిగిన నీళ్లలో ఎక్కువగా ఉంటుంది. అందువల్ల జుట్టును బియ్యం కడిగిన నీళ్లతో తలంటుకోవటం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.బియ్యం (Rice) కడిగిన నీళ్లతో తలంటుకుంటే చుండ్రు పోతుంది. తలపై ఉండే చిన్న చిన్న పొక్కులు కూడా పోతాయి. జుట్టు నిగనిగలాడుతుంది.కొందరికి జుట్టు జిడ్డుగా ఉంటుంది. అలాంటి వారు బియ్యం కడిగిన నీళ్లతో తలంటుకోకూడదు. ఒక వేళ తలంటుకుంటే జుట్టు పొడిబారిపోతుంది.వారానికి ఒక సారి లేదా రెండు సార్లు మాత్రమే బియ్యం నీళ్లతో (Rice Water) తలంటుకొమ్మని నిపుణులు సూచిస్తున్నారు.
బియ్యం నీళ్ల (Rice Water) తయారీ ఇలా..
- ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్లు పోయాలి. బియ్యాన్ని చేతితో బాగా రుద్దాలి.
- 30 నిమిషాల తర్వాత నీళ్లను వేరే గిన్నెలో పోయాలి.
- ఈ నీళ్లను తలపై పోసుకొని బాగా మర్దనా చేయాలి.
- ఒక పది నిమిషాల తర్వాత జట్టును చల్లటి నీళ్లతో కడగాలి.
Also Read: No Selfies Day: ఈరోజు ‘నో సెల్ఫీస్ డే’.. మనం కూడా పాటిస్తామా?
Related News

Control Cholesterol with Onions: ఉల్లిపాయలతో కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుందా? షుగర్ రోగులకు మంచిదా?
ఉల్లిపాయలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఉల్లి తినడం, కొలెస్ట్రాల్ మధ్య సంబంధం ఉంటుంది.ఉల్లిపాయలు మీ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో..