Beauty Tips: చిన్నపిల్లలకు సన్ స్క్రీన్ లు, బాడీ లోషన్స్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఇది మీకోసమే!
అందంగా కనిపించాలి అని చిన్న పిల్లలకు సన్ స్క్రీన్ లు, బాడీ లోషన్స్ అప్లై చేసేవారు తప్పకుండా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని లేదంటే లేని పోనీ సమస్యలు వస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు..
- By Anshu Published Date - 02:00 PM, Mon - 12 May 25

వేసవికాలం అలాగే చలికాలం నుంచి చర్మాన్ని సంరక్షించు కోవడానికి మరింత అందంగా కనిపించడం కోసం మార్కెట్లో దొరికే ఎన్నెన్నో బ్యూటీ ప్రోడక్ట్లను ఉపయోగిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా మార్కెట్ లో దొరికే క్రీములు, హెయిర్ ఆయిల్స్, హెయిర్ కండీషనర్లు, ఆయింట్ మెంట్లు, సన్ స్క్రీన్ లు వంటివి ఉపయోగించేవారు చాలా జాగ్రత్తగా ఉండాలట. మరి ముఖ్యంగా పెద్దల సంగతి పక్కన పెడితే చిన్న పిల్లలకు ఇలాంటివి అప్లై చేసే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.
ఎందుకంటే పెద్దలు చర్మంతో పోల్చుకుంటే చిన్నపిల్లల మరింత సాఫ్ట్ గా ఉంటుంది. అంతేకాకుండా ఇలాంటివి అప్లై చేసినప్పుడు అవి చిన్న పిల్లలపై దుష్ప్రభావాలు చూపిస్తాయట. మరి ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లలపై మరింత ప్రభావాన్ని చూపిస్తాయని చెబుతున్నారు. శరీరం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి వారు తొందరగా అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. పెద్దపెద్ద కంపెనీలకు సంబంధించిన బ్యూటీ ప్రోడక్ట్లు చిన్న పిల్లలపై చాలా రకాలుగా దుష్ప్రభావాలు చూపించే అవకాశం ఉంటుందట.
మరి ముఖ్యంగా ఇటువంటి సౌందర్య పదార్థాలు చిన్నారుల ఎదుగుదలపై ప్రభావం చూపిస్తాయట. ముఖ్యంగా హార్మోన్ల అసమతుల్యతకు కారణ అవుతాయని చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి బ్యూటీ ప్రోడక్ట్ లను ఉపయోగించే ముందు తల్లిదండ్రులు తప్పనిసరిగా నిపుణుల సలహా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. ఒకవేల మీ పిల్లలు అందంగా కనిపించాలి అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని బ్యూటీ ప్రోడక్ట్ లను ఉపయోగించడం మంచిది. లేదంటే న్యాచురల్ పద్ధతులను ఫాలో అవ్వడం మంచిది అని చెబుతున్నారు.